NTV Telugu Site icon

MP Komatireddy: ఏళ్లు గడుస్తున్నా హామీ నిలబెట్టుకోలే.. కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

Mp Komatireddy

Mp Komatireddy

MP Komatireddy: ఏళ్లు గడుస్తున్నాయే గానీ హామీని నిలబెట్టుకోలేదని సీఎం కేసీఆర్ కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇంటర్ విద్యను పూర్తి చేసుకుని డిగ్రీ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ కళాశాలలో చదువుకోవాల్సి వస్తోందన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. గత ఎన్నికల సమయంలో భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని మీ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏళ్లు గడుస్తున్నాయే గానీ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. భువనగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేనందున నూతన కాలేజీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎంతోకాలంగా ఉందన్న విషయాన్ని మరోసారి మీ దృష్టికి తెస్తున్నానని తెలిపారు.

Read also: RRKPK: బాలీవుడ్ లిస్టులో మరో హిట్… మంచి రోజులు వస్తున్నాయి

పని చేయని కాలేజీల్లో ఒకదానిని భువనగిరి వంటి అవసరమైన ప్రాంతానికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దృష్ట్యా.. ఈ పాలసీ మేరకు కొత్త కాలేజీని బడంగ్ పేట్ కి షిఫ్ట్ చేసేందుకు ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్స్ఇదే అయినందున వెంటనే భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించేలా ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపారు. పని చేయని కాలేజీని షిఫ్ట్ చేయడంలో ఆర్ధిక సంబంధమైన చిక్కులు కూడా లేవు. ఇప్పటికే దోస్త్ ఆన్ లైన్ ద్వారా డిగ్రీ కాలేజీ అడ్మిషన్లు ప్రాసెస్ లో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు మూడు దశలు పూర్తి అయ్యాయని అన్నారు. కాలేజీ మంజూరయిన పక్షంలో భువనగిరిలోని విద్యార్థులు కనీసం నాలుగో దశలోనైనా తమ వెబ్ ఆప్షన్స్ ని ఉపయోగించుకోగలుగుతారని తెలిపారు. అందువల్ల ఈ విజ్ఞప్తిని పరిశీలించి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ప్రారంభించిన పక్షంలో వారు తమ హయ్యర్ స్టడీస్ కోసం హైదరాబాద్ కు వెళ్ళవలసిన అవసరం ఉండదని తెలిపారు. అందుకే, ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది.
Telangana Rains: రెండ్రోజుల పాటు వర్షసూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

Show comments