Site icon NTV Telugu

MP Dharmapuri Arvind: కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు.. 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో చూడాలి..!

Mp Dharmapuri Arvind

Mp Dharmapuri Arvind

బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కొత్త ప్రభుత్వాన్ని శుభకాంక్షలు తెలిపారు. మంగళవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదన్నారు. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారో చూడాలని, అప్పటి వరకు వేచి చూస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం, డిప్యూటీ సీఎంలు కేంద్రం సాయం కోరడం మంచి పరిణామని, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Also Read: Breaking: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేసిన ప్రభుత్వం

రానున్న రోజుల్లో పసుపుకు రూ.20 వేలు మద్దతు ధర ఇప్పిస్తాం. అనంతరం మాట్లాడుతూ.. ఎంపీగా చాలా సంతోషంగా ఉన్నానన్నారు. నిజమాబాద్ పార్లమెంటు పరిధిలో 30 శాతం ఓట్లు సాధించటం సంతోషంగా ఉందని, పార్టీని అభివృద్ధి చేసేందుకు కోరుట్లలో పోటీ చేశానని తెలిపారు. జీరో బడ్జెట్ ఎన్నికలకు కోరుట్ల ఎన్నికలు నాంది పలికాయని, నాకు డబ్బులు పంచమని చాలా మంది చెప్పారు.. కానీ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేశానన్నారు. పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ చేశానని, ఎంపీ చాలా సంతోషంగా ఉన్నానన అర్వింద్ వ్యాఖ్యానించారు.

Also Read: Peddireddy Ramachandra Reddy: నా రాజకీయం జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన సీఎంను చూడలేదు..

Exit mobile version