NTV Telugu Site icon

MP Dharmapuri Arvind : ఇన్ని ఏళ్లుగా.. ఆకులు పీకుతున్నారా అయ్యా కొడుకులు

ఉత్తర కుమారుడు, తుపాకీ రాముడు, బుడ్డార్ ఖాన్ లను కలిపితే ఒక కేటీఆర్ అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌ పాగల్ అయిపోయిండా అని చర్చ జరుగుతుందని, మనిషి పిచ్చికుక్కను కలిస్తే కేటీఆర్‌లా అవుతాడని, నాటు వైద్యమే దీనికి మందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్‌కి పచెంబ ట్రీట్ మెంట్ ఇవ్వాలని, ఆముదం తీట కోయిలాకు పూసి పచ్చి చింత బరిగెలతో కొట్టడమే ఆ ట్రీట్ మెంట్…తోలు దొడ్డు అయిందన్నారు. ఎగిరే గుర్రం (మోడీ) ఎక్కడ, గబ్బు గాడిద (కేసీఆర్) ఎక్కడ అని ఆయన విమర్శించారు. 3 లక్షల 94 వేల కోట్లకు పైగా కేంద్రం తెలంగాణలో ఖర్చు పెట్టిందని, నేను చెప్పింది తప్పు అయితే కేటీఆర్‌ ఏది చెబితే అది చేస్త… తప్పు కాకా పోతే కేటీఆర్‌ని ఎడమ కాలు చెప్పుతో తొక్కుతా అని ఆయన సవాల్ విసిరారు. కేటీఆర్‌ నిజాయితీ పరుడువి అయితే 111 జీఓ విరుద్ధంగా జన్వడ లో కట్టిన నిర్మాణాన్ని కూల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైస్ మిల్స్ ధాన్యం మాయంపై సీబీఐ కి ఎన్‌ఓసీ ఇవ్వు అని, తంబాకు టెస్ట్ కు బండి సంజయ్ రెడీ… ఆయనను నేను తీసుకొస్తా… కొకైన్ టెస్ట్ కి నివ్వు వస్తావా కేటీఆర్‌ అని ఆయన ధ్వజమెత్తారు.

మీరు , మీ చెల్లి ఎంత అక్టీవ్ గా తిరిగితే బీజేపీ కి అంత లాభమని, మీ చెల్లె నిజామాబాద్ కి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి అని ఆయన అన్నారు. 7 మండలాలను ఏపీలో కలిపితే ఇన్ని ఏళ్లుగా చింతమడకలో జిలేడు ఆకులు పీకుతున్నారా అయ్యా కొడుకులు అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మొహర్రం ర్యాలీలు వద్దని చెప్పు… మజీద్ ల స్పీకర్ లు వద్దని చెప్పు.. యూస్ లెస్ ఫెలో అంటూ దుయ్యబట్టారు. నా అడ్రస్ ఆర్మూర్… ని అడ్రస్ మీ ఇంటి వాళ్లకు తెలుసా… నా అడ్రస్ మీ చెల్లెని అడిగితే కరెక్ట్ గా చెబుతుంది.. సిరిసిల్లలో కేటీఆర్‌ ఓడిపోతాడు, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కి పొత్తు ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు.