CRIF Sanctions: బండి సంజయ్ ప్రయత్నం..రోడ్లకు ఇక మహర్దశ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శ్రమ ఫలించింది. తన పార్లమెంట్ పరిధిలోని రోడ్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ బండి సంజయ్ చేసిన విజ్ఝప్తి పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) కింద 2021-22 సంవత్సరానికిగాను తెలంగాణకు రూ. 878.55 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఆ శాఖ జాతీయ కార్యదర్శి కమల్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
మంజూరైన మొత్తం నిధుల్లో దాదాపు రూ.204 కోట్లు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని రహదారుల నిర్మాణానికి కేటాయించడం విశేషం. వాస్తవానికి కేంద్రం నుండి రాష్ట్రానికి వివిధ శాఖల ద్వారా నిధులు రాబట్టేందుకు బండి సంజయ్ తీవ్రంగా యత్నిస్తున్నారు. సీఐఆర్ఎఫ్ కింద రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు.
Also Read
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
- Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్‌సిగ్నల్
- Off The Record : కామారెడ్డి మున్సిపాలిటీలో రచ్చ రంబోలా.. ఎమ్మెల్యే vs చైర్ పర్సన్ వివాదం
కేంద్రం తన విజ్ఝప్తికి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడంపట్ల బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధికారులకు బండి సంజయ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు రహదారుల నిర్మాణానికి ఆయా నిధుల్లోనుండి దాదాపు రూ.204 కోట్లు కేటాయించినట్లు బండి సంజయ్ ఈ సందర్భంగా తెలిపారు. నిధులు మంజూరు కావడంతో ఆయా పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. నిర్ణీత గడువులోగా రహదారుల నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sun Risers Hyderabad: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్‌పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్‌లో ఉన్నది అదే అంటూ..
-
Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!