Movie Ticket For One Rupee: థియేటర్లో సినిమా చూడటం అంటే ఆకిక్కే వేరబ్బా.. ప్రతి ఒక్కరూ కుటుంబం, స్నేహితులతో సినిమాలు చూడటం ఆనందిస్తారు. అయితే ఇటీవల సినిమా టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. వారాంతపు రోజుల్లో అయితే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవుతుంది. మల్టీప్లెక్స్‌లకు వెళ్లడం, సినిమాలు చూడడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఓ వ్యక్తి మల్టీప్లెక్స్‌కి వెళ్లి సినిమా చూడాలంటే కచ్చితంగా రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ మనం పర్స్‌లో ఉండాల్సిందే. దానికి తోడు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ అదనంగా ఉంటాయి. ఇక నలుగురు సభ్యులతో కుటుంబం థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తే కనీసం రూ. 2 వేలు ఉండాల్సిందే.
కానీ ఒక థియేటర్‌లో సినిమా టిక్కెట్‌ను కేవలం ఒక్కరూపాయి. అది కూడా ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాద్ లోనే. అదికూడా మల్టీప్లెక్స్‌లో ఒరే ఆజాము లగెత్తండ్రోయ్ అని మనసులో అనుకుంటున్నారు కదూ.. ఆ థియేటర్ గురించి భాగ్యనగర వాసులకు తెలియగానే ఇప్పుడు ఆ థియేటర్ ఎక్కడుంది?, ఆఫర్ ఎంతకాలం ఉంటుందో గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు హైదరాబాద్ వాసులు. అంత అవసరమే లేదండి. దానిగురించే చెబుతున్నాము.. ఆ థియేటర్ మౌలాలిలో ఉంది. మూవీ మ్యాక్స్ “ఏఎంఆర్” పేరుతో మౌలాలిలో థియేటర్ ఏర్పాటు చేశారన్న మాట. డిసెంబర్ 15న థియేటర్ ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరగనుంది. కానీ ప్రారంభ ఆఫర్ కింద ఆరోజు ఒక్క రూపాయికే టికెట్లు విక్రయించాలని థియేటర్ యాజమాన్యం నిర్ణయించింది. డిసెంబర్ 15న మూవీ మ్యాక్స్ మల్టీప్లెక్స్‌లో మొత్తం 11 సినిమాలను ప్రదర్శించనున్నట్లు థియేటర్ యాజమాన్యం వెల్లడించింది.
మూవీ మ్యాక్స్ మల్టీప్లెక్స్‌లో తెలుగుతో పాటు హిందీ సినిమాలను కూడా ప్రదర్శించనున్నారు. తొలి ఆఫర్ కింద ఆ రోజు థియేటర్లో ఏ సినిమా చూసినా కేవలం ఒక్క రూపాయికే విక్రయించనున్నట్లు వెల్లడించారు. యశోద, గుర్తుందా శీతాకాలం, లవ్ టుడే, మసూద, హిట్-2, చెప్పాలని ఉంది, పంచతంత్రం, కాంతార, భేడియా, దృష్యం- 2 సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈ సినిమాలన్నింటికీ కేవలం రూ.1 కే టిక్కెట్లు అందిస్తున్నారు. అయితే ఒక్కరూపాయికే సినిమా చూడాలని అనుకుంటే మాత్రం నేరుగా సినిమా థియేటర్ కు వెళ్లాల్సి ఉంది. అక్కడుకు వెళ్లి రూపాయికి సినిమా టికెట్ తీసుకుని మీ కిస్టమైన సినిమాను చూడొచ్చన్నమాట. ఇంకెందుకు ఆలస్యం మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని మిస్ కాకండి.
Udhayanidhi Stalin: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్..