NTV Telugu Site icon

KTR: నా పేరుతో కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడు..? నా దృష్టిలో అమ్మే నా దేవత..!

Ktr 2

Ktr 2

నా పేరు మీద కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడు..? అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌.. డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి.. విపక్షాల విమర్శలపై స్పందించారు.. నా పేరు మీద కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడు..? అని నిలదీసిన ఆయన.. మతం పేరుతో… దేవుడి పేరుతో.. కొట్లాటలు చేయమని ఎవరు చెప్పారు…? అని మండిపడ్డారు.. నా దృష్టిలో మా అమ్మ నా దేవత అని స్పష్టం చేశారు కేటీఆర్.. 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న అంబేద్కర్‌ యూనివర్సిటీకి శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. నీళ్లు, నిధులు, నియామకాలు… ధ్యేయంగా తెలంగాణ కోసం ఉద్యమించాం.. ఆ దిశగా రాష్ట్రం సాధించుకున్నాం.. కానీ… ఈరోజు ఎక్కడెక్కడ నుంచో.. ఎవరెవరో వచ్చి… ఏదేదో మాట్లాడుతున్నారు అని ఫైర్‌ అయ్యారు. 12 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ ట్యాక్స్ ని వేవ్ చేయొచ్చు అంట కానీ… పేదలకు 2, 3 లక్షలు పెట్టి పెన్షన్లు ఇవ్వొద్దు అంట… ఉచితాలు అని మాట్లాడుతున్నారు.. ప్రజలను సోమరులు చేస్తున్నారు అదీ ఇదీ అంటున్నారు.. 400 ఉన్న సిలిండర్ 1000 రూపాయలు ఎందుకు అయ్యింది అంటే మాత్రం నోరు ఎత్తరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Ghanta Chakrapani: ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలొచ్చాయి..

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్… కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో ఉంది.. అలాంటి ప్రాజెక్ట్ లో ఉన్న చిన్న చిన్న లోపాలను కూడా భూతద్దం పెట్టి వెతికి… అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.. ఓర్వలేక కాళేశ్వరంపై ఏడుస్తున్నారు అని మండిపడ్డ ఆయన.. 8 ఏళ్లలో ఏం చేశారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.. కొత్త జల ప్రాజెక్టులు కట్టి, ఉన్న సవాళ్లను అధిగమించి ఎదుర్కొన్నాం, చెరువులను అభివృద్ధి చేసుకున్నాం, అమెరికాకు మంత్రి గా నాలుగైదు సార్లు వెళ్లి వచ్చాను, అక్కడ ఓ రాష్ట్రంలో 10వేల చెరువులు ఉన్నాయని చెప్పారు.. కానీ, మా దగ్గర 46 వేల చెరువులు ఉన్నాయని చెప్పాను.. ఈ చెరువులను బాగు చేసుకుంటే ఇవన్నీ కలిపి ఒక నాగార్జున సాగర్ లాగా తయారువుతుందని అన్నారు.. అందుకే, వాటిని పునరుద్ధరణ చేశాం.. గతంలో మాదిరిగా చెరువుల కట్టలు తెగే పరిస్థితి లేదు.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అన్నారు.

సిరిసిల్ల జిల్లాతో పాటు చుట్టూ ఉన్న జిల్లా ప్రాంతాలు కూడా దుర్భిక్షంగా ఉండేవి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు చెరువుల అభివృద్ధితో గ్రౌండ్ లెవల్ వాటర్ పూర్తిగా పెరిగిందని గుర్తుచేశారు కేటీఆర్.. హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాలకు రాబోయే శతాబ్దం వరకు మంచి నీటిని అందించే ప్రాజెక్ట్ కాళేశ్వరం అని స్పష్టం చేసిన ఆయన.. రాబోయే రోజుల్లో మీరే ఈ వార్తను అంగీకరిస్తారు.. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణా.. అన్నారు. ఇంటింటికి నీళ్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించిన ఆయన.. ఈ విషయం చెప్పింది కేంద్ర జలాశక్తి మిషనే అన్నారు.. కానీ, ఇక్కడకు వచ్చి తిడుతారు అది వేరే విషయం అంటూ కేంద్రంలోని పెద్దలు, బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్‌. కాగా, హైదరాబాద్‌లో మునావర్ ఫారూఖీ కామెడీ షో తర్వాత.. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఓ వీడియో విడుదల చేయడం.. అది వివాదాస్పదంగా మారడం.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయడం.. ఎనిమిదేళ్ల తర్వాత హైదరాబాద్‌లో కర్ఫ్యూ వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో.. కేటీఆర్‌ చేసీన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Show comments