NTV Telugu Site icon

Hyderabad Rain: మళ్ళీ తడిసిముద్దయిన హైదరాబాద్

Rainnnns

Rainnnns

హైదరాబాద్ లో మరోసారి భారీగా కురుస్తోంది వర్షం. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. నాంపల్లి, బషీర్‌బాగ్‌, కోఠి, అబిడ్స్‌, అంబర్‌పేట్‌, సుల్తాన్‌బజార్‌, బేగంబజార్‌, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మీర్‌పేట్‌, అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి.

రుతుపవనాల ప్రవేశంతో బుధవారం నాడు ఉదయం కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో రోడ్లపైనే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈనెల 14న వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు ముందే హెచ్చరించారు. అయితే ఎక్కడా వాన జాడలేదు. అయితే బుధవారం ఉదయం, రాత్రి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు కూడా పడ్డాయి.

బండ్లగూడలోని కందికల్ లో 5.3 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 3.2, అబ్దూల్లాపూర్ మెట్లో 2.6 సెంటిమీటర్ల వర్షం పడింది. ఇటు మహబూబాబాద్, నల్లగొండ, మెదక్, రాజన్నసిరిసిల్ల, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, నాగర్ కర్నూల్, కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాల్లో వానలు పడ్డాయి. దీంతో వాతావరణం చల్లబడింది. రుతుపవనాల ప్రభావం వల్ల ఈ నెల 18వ తేదీ వరకూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు హెచ్చరికలు జారీచేసింది వాతావరణ శాఖ. నగర శివారులోని శంషాబాద్ లో వానల వల్ల కాలనీల్లోకి నీరు ప్రవేశించింది. దీంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు.

I2U2: ఇండియా, ఇజ్రాయిల్, యూఏస్ఏ, యూఏఈ తొలి సమావేశం