NTV Telugu Site icon

Moinabad: మొయినాబాద్ మర్డర్ కేసు.. హత్యకు గురైన యువతి ముస్లింగా గుర్తింపు..!

Moinabad

Moinabad

Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన యువతి మర్డర్ కేసు నేటితో నాల్గవ రోజుకు చేరుకుంది. మొయినాబాద్ మర్డర్ కేసు ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులకు మరో దిశ కేసును చేధించనున్నట్లు కనిపిస్తుంది. అయితే పోలీసులకు ఈ మర్దర్ కేసులో కాస్త పురోగతి కనిపించింది. హత్య గురైన యువతి మల్లెపల్లి కి చెందిన ముస్లిం యువతి థైసీన్ గా గుర్తించారు. ఆ యువతిని వేరేచోట హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హంతకుల కోసం వేట కొనసాగుతున్నారు. అయితే మర్డర్ కేసు ఛేదించేందుకు అక్కడ వున్న సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్, యువతి మొబైల్ ఫోన్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. యువతి మర్డర్ కేస్ దర్యాప్తుకు 7 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మర్డర్ స్పాట్ లో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు, క్లూస్ టీమ్ సెర్చింగ్ చేస్తోంది. యువతిని ఎక్కడో చంపి బైక్ మీద తీసుకువచ్చి ఇక్కడ కాల్చినట్లు పోలీసులు అనుమానం.

Read also: Hanuman: లెక్కల్ని తారుమారు చేస్తున్న సూపర్ హీరో…

మొయినాబాద్ మండలం బాకారం గ్రామ శివారులోని డ్రీమ్‌వ్యాలీ రిసార్ట్‌కు వెళ్తుండగా సోమవారం పట్టపగలు ఓ యువతిని హత్య చేసి దహనం చేశారు. మంటల్లో కాలిపోతున్న గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతదేహాలు కాలిపోయి, రైతుల సాయంతో మంటలను ఆర్పివేశారు. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సగం కాలిపోయిన సెల్‌ఫోన్‌ను గుర్తించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతుడికి 25 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.

Read also: Atal Setu : నేడు ప్రధాని మోడీ ప్రారంభించబోయే ‘అటల్ సేతు’ విశేషాలివే

ఏడు బృందాలుగా ఏర్పడి విచారించగా.. వివరాలు తెలియరాలేదు. బాధితురాలి ఫోన్‌ దొరికినా సిమ్‌కార్డు తొలగించడంతో మొయినాబాద్‌ చుట్టుపక్కల ఏ పోలీస్‌ స్టేషన్‌లోనూ మిస్సింగ్‌ ఫిర్యాదు రాకపోవడంతో కేసు ఛేదించడం కష్టంగా మారింది. మొబైల్ ఫోన్ పూర్తిగా కాలిపోవడంతో పోలీసులు సిమ్ కార్డు ఐఎంఈ నంబర్‌ను గుర్తించడం ప్రారంభించారు. ఆధారాలు లేకపోవడంతో విచారణలో కాస్త జాప్యం జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం యువతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో ఉంచారు. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలు, సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం పోలీసులు, క్లూస్ టీమ్ హత్య జరిగిన ప్రాంతంలో గాలిస్తున్నారు. యువతి ప్యాంట్ వెనుక జేబులో స్టిక్కర్ కనిపించింది. నిందితులు ఓ దారి నుంచి వచ్చి మరో దారిలో వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Hanuman: లెక్కల్ని తారుమారు చేస్తున్న సూపర్ హీరో…