School Picnic Tragedy: సరదాగా పిక్నిక్కు వెళ్లి.. ఊయల తగిలి పదేళ్ల బాలుడు మృతి.!
- మొయినాబాద్‌లో స్కూల్ పిక్నిక్ విషాదం
- ఊయల తగిలి పదేళ్ల బాలుడు మృతి
- స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆరోపణలు
- కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో నిర్వహించిన స్కూల్ పిక్నిక్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ ఇనుప ఊయల బలంగా తగలడంతో పదేళ్ల బాలుడు అభిరామ్ ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థి యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డాడు. నార్సింగిలోని హ్యాపీ స్కాలర్స్ స్కూల్ యాజమాన్యం, మొయినాబాద్ లోటస్ పాండ్ పార్క్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగింది.. ప్రమాదానికి కారణాలివే
మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌లో స్కూల్ పిక్నిక్ సందర్భంగా భారీ ఇనుప ఊయలపై సుమారు 10 మంది పిల్లలు కూర్చోగా, మరో నలుగురు వెనుక నుంచి వేగంగా ఊపినట్లు సమాచారం. ఆ క్రమంలో ఊయల అదుపుతప్పి కదులుతుండగా, ముందుకు వెళ్లిన భారీ ఊయల అంతే వేగంగా వెనక్కి వచ్చి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అభిరామ్ నుదురు, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలు కాగా, యశ్వంత్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. చిన్నపిల్లలు ఊయల వేగాన్ని సరిగా అంచనా వేయలేకపోవడంతోనే ఈ పెను ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Also Read
- Musi River Rejuvenation : మూసీ పునరుజ్జీవానికి ముహూర్తం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- Hyderabad Green Tankers: గ్రీన్ ట్యాంకర్ల పేరుతో మురుగు నీటి సరఫరా కలకలం.. ఖాజాగూడలో ఏం జరుగుతోంది?
- Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. కోటి మంది మహిళలకు కోటి చీరలు.. ఎవరు అర్హులు?
- Kishan Reddy: దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ డ్రగ్స్.. యువత భవిష్యత్తును కాపాడుకోవాలి!
పర్యవేక్షణ లోపం.. తల్లిదండ్రుల ఆగ్రహం
ప్రమాదం జరిగిన సమయంలో కనీసం ఒక్క టీచర్ గానీ, స్కూల్ సిబ్బంది గానీ అక్కడ లేకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. యాజమాన్యాన్ని నమ్మి పిల్లలను పిక్నిక్కు పంపిస్తే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన భద్రతా చర్యలు, పర్యవేక్షణ లేకపోవడం వల్లే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని మృతుడు అభిరామ్ తండ్రి ఆరోపించారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కేసు నమోదు.. మేనేజ్ చేసే యత్నాలపై ఆరోపణలు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో మృతికి కారణమైనట్లు, ప్రాణాలకు ప్రమాదం కలిగించే చర్యలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం బయటకు పొక్కకుండా కొందరు వ్యవస్థలను మేనేజ్ చేసే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
School Picnic Tragedy: సరదాగా పిక్నిక్కు వెళ్లి.. ఊయల తగిలి పదేళ్ల బాలుడు మృతి.!
-
Musi River Rejuvenation : మూసీ పునరుజ్జీవానికి ముహూర్తం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
OTR: నిడదవోలులో కూటమి కుమ్ములాట.. వైస్ చైర్మన్ పదవితో రచ్చ..!
-
OTR: టీడీపీ గెలిచినా నేతల్లో అసంతృప్తి.. నంద్యాలలో ఏం జరుగుతోంది?
-
Tharun Bhascker: డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు! ఇకపై తన రూట్ మారుస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!