MLA,s Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన కేసులో కేరళకు చెందిన తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో తుషార్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తుషార్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను ఆదేశించింది. అంతేకాదు విచారణకు సహకరించాలని తుషార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ మధ్యాహ్నo 2.30 కి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సిట్ దర్యాప్తుపై స్టే విధించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో తుషార్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కూడా ఆ పిటిషన్‌లో కోరారు. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని తుషార్, బీఎల్ సంతోష్, జగ్గుస్వామికి సిట్ నోటీసులు జారీ చేయగా.. అయితే ఈ ముగ్గురు విచారణకు రాలేదు.
Read also: Blurr Trailer: ఆకట్టుకుంటున్న తాప్సీ ‘బ్లర్’ ట్రైలర్
అయితే తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో రెండు వారాల సమయం అడిగానని తుషార్ పేర్కొన్నాడు. ఈ విషయమై సిట్‌కు మెయిల్ పంపినట్లు తెలిపారు. ఈ మెయిల్‌పై స్పందించకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారని తుషార్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తుషార్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను ఆదేశించింది. మరోవైపు విచారణకు తుషార్ సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 23న బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు పంపింది. అంతకు ముందు కూడా విచారణకు రావాలని నోటీసులు కూడా పంపారు. కానీ సంతోష్ విచారణకు రాలేదు. ఈ నోటీసులపై బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 25న బీఎల్ సంతోష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. డిసెంబర్ 5 వరకు స్టే కొనసాగుతుందని కోర్టు ప్రకటించింది.
Fifa World Cup: ఇంటిదారి పట్టిన ఇరాన్.. సంబరాలు జరుపుకున్న ఇరాన్ ప్రజలు
