Site icon NTV Telugu

Jairam Ramesh: మోడీ పాలసీలు దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నాయి

Jairam Ramesh

Jairam Ramesh

Jairam Ramesh: మోడీ పాలసీలు దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్‌ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో రెండో రోజు కొనసాగుతుంది. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుందని, కాంగ్రెస్‌కు భారత్‌ జూడో యాత్ర సంజీవని అని ప్రజలు అంటున్నారని అన్నారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర 14 కి.మీ పూర్తి అయ్యిందని, 1/3 జూడో యాత్ర పూర్తి అయిందని తెలిపారు. ఇంకో 11 రోజుల తెలంగాణలో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. నవంబర్ 4న పాదయాత్రకు బ్రేక్ వుంటుందని, అక్టోబర్‌ 31న శంషాబాద్ లో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు.

Read also: Somu Veerraju : జనసేనతో పొత్తు.. కీలక వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు

మోడీ పాలసీ లు దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నాయని అన్నారు. ఆర్థిక అసమతుల్యత పెరిగిందని తెలిపారు. దేశం పేదరికంలోకి వెళ్తుందని అన్నారు. సొసైటీలో విభజన తెచ్చింది బీజేపీనే అంటూ మండిపడ్డారు. ఏం తినాలి..ఏం డ్రెస్ వేసుకోవాలి అనే విభజన తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఆదిపత్యం పెరిగిపోయిందని నిప్పులు చెరిగారు. ఇంత పెద్ద రాజకీయ యాత్ర ఎప్పుడు జరగలేదని పేర్కొన్నారు. ఇది మన్ కి బాత్ కాదు.. రాహుల్ యాత్ర ..సమస్యలు వినడానికి, మన్ కి బాత్ లెక్క వన్ సైడ్ కాదంటూ వ్యాఖ్యానించారు. రాహుల్..లిజనింగ్ యత్ర అన్నారు. ఎంఐఎ, టీఆర్‌ఎస్‌, బీజేపీకి బూస్టింవ్ ఇస్తున్నాయని, తెలంగాణలో మాకు మూడు ఛాలెంజ్ లు అవి టీఆర్‌ఎస్‌, ఎంఐఎం, బీజేపీ అంటూ జయరాం రమేష్‌ అన్నారు.

Exit mobile version