Site icon NTV Telugu

Modiji Kutch GST Hojaye: మోదీజీ కుచ్‌ జీఎస్టీ హోజాయే..! నగరంలో వెలసిన ఫ్లెక్సీలు

Modiji Kutch Gst Hojaye

Modiji Kutch Gst Hojaye

నిత్యావసర సరకులపై.. మరీ ముఖ్యంగా పిల్లలకు పౌష్టిక ఆహారం పై పాలు, అనుబంధ ఉత్పత్తులపై ఏమాత్రం ఆలోచన లేకుండా కేంద్రం జీఎస్టీ విధించడంపై ప్రజలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోజురోజుకూ ధరల భారం మోపుతున్న బీజేపీ సర్కారు తీరుపై జనం మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో.. పాల ఉత్పత్తులపై జీఎస్టీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ కంటోన్మెంట్‌లోని టివోలి చౌరస్తా వద్ద ‘మోదీజీ కుచ్‌ జీఎస్టీ హోజాయే’ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో చర్చనీయాంశకంగా మారింది. మొన్నటి వరకు గ్యాస్‌పై వున్న ప్లేక్సీలు దర్శనమివ్వగా.. నేడు పాలపై ప్లెక్సీలు దర్శనమివ్వడంతో.. ఇది వార్త కాస్తా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లలకు కనీసం పాలు కూడా లేకుండా చేస్తారా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. అయితే.. అంత్యక్రియల సేవలపైనా కేంద్రం జీఎస్టీని విధించడంతో, చచ్చిన తర్వాత కూడా జీఎస్టీ కట్టాలా..? అంటూ జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

అయితే కొందరు చిరువ్యాపారులు పనిచేసుకుంటేనే బ్రతికేటోళ్లమని, ప్రతి వస్తువుపై ట్యాక్స్‌లు పెంచడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు చేసిందేమీ లేదని, గ్యాస్‌ ధరలు పెంచి కట్టెలపొయ్యి పెట్టుకునే పరిస్థితికి దిగజార్చింది మోదీ ప్రభుత్వమంటూ మండిపడుతున్నారు. ఇంధనం ధరలు ఆకాశానికి అంటుతుంటే తినే వస్తులపైనా ధరలు పెంచి పేదోడి నడ్డి విరుస్తున్నారు చిరువ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అన్ని రకాల ధరలు చుక్కలనంటాయని, ఇక పాలు, పాల ఉత్పత్తులకు కూడా జీఎస్టీ విధిస్తే పేదలు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంత్రక్రియల సేవలపైనా పన్ను విధించి చచ్చినా సరే జీఎస్టీ కట్టాలనడం దురదృష్టకరమని ప్రజలు మండిపడుతున్నారు.

Shivraj Singh Chouhan: క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మధ్యప్రదేశ్‌కు చెందినవారే..!

Exit mobile version