Site icon NTV Telugu

Telangana Elections 2023: రాష్ట్రానికి బీజేపీ అగ్ర నేతలు.. మోడీ, అమిత్‌షా, యోగీ, జేపీ నడ్డా ప్రచారం

Bjp Leders

Bjp Leders

Telangana Elections 2023: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనాయకత్వం వరుస పర్యటనలకు సిద్ధమైంది. ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 8 రోజులుగా బీజేపీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి చెందిన పలువురు అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఒకరోజు పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రానికి రానున్నారు. పార్టీ, స్వతంత్ర సంస్థలు, ఇతర మాధ్యమాలు చేస్తున్న సర్వేల్లో రాష్ట్రంలో భాజపాకు సానుకూల ఫలితాలు వస్తాయన్న ధీమాతో జాతీయ నాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా నేడు, రేపు, (25, 26, 27) తేదీల్లో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలో బీజేపీ అగ్రనేతలు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారని సమాచారం.

Read also: Shruti Haasan : శృతిహాసన్ పాటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

ఈ పర్యటనలో మోడీ రాజ్‌భవన్‌లో బస చేస్తారని వార్తలు వచ్చాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూబ్లీహిల్స్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముథోల్, సంగారెడ్డి, నిజామాబాద్ అర్బన్ లలో సభలకు హాజరై హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి (25,26, 27) తేదీల్లో వివిధ జిల్లాల్లో నిర్వహించే సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు. అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 28న రోడ్ షోతో ఆయన పర్యటన ముగిసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 25, 26 తేదీల్లో 10 బహిరంగ సభల్లో పాల్గొంటారని సమాచారం. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆరు సమావేశాల్లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారని సమాచారం.
Kotta Manohar Reddy: మహేశ్వరంలో కొత్త మనోహర్ రెడ్డి ప్రచారం.. అడుగడుగున ప్రజల నీరాజనం

Exit mobile version