NTV Telugu Site icon

MMTS Services: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌.. సర్వీసులు పెంచిన ఎంఎంటీఎస్..

Mmts

Mmts

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఎంఎంటీఎస్‌.. కరోనా ఆంక్షలు, ప్రయాణికుల రద్దీ కూడా లేకపోవడంతో.. కోవిడ్‌ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా కొద్ద సర్వీసులను మాత్రమే నడుపుతూ వస్తున్నారు అధికారులు.. అయితే, ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడానికి తోడు.. ప్రయాణికుల రద్దీ కూడా పెరగడంతో.. క్రమంగా సర్వీసులను పెంచుతూ వస్తున్నారు అధికారులు.. వర్క్‌ ఫ్రమ్‌ హోం ఎత్తివేసి.. ఐటీ సంస్థలు కూడా చాలా వరకు పునరుద్ధరించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారి సంఖ్య పెరిగింది.. సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, ఐటీ ఉద్యోగుల కార్యాలయాలకు వెళ్తుండడంతో రద్దీ పెరిగింది. ఇక, ప్రయాణికుల డిమాండ్‌ పెరగడంతో.. సర్వీసులను కూడా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.

Read Also: Tulasi Reddy: నా ఇష్టం నా రాజ్యాంగ అన్నట్లు జగన్ వ్యవహారం..

మరోవైపు భారీగా పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు కూడా ప్రయాణికులు ఎంఎంటీఎస్‌ను ఆశ్రయించేలా చేసినట్టుగా తెలుస్తోంది.. దీంతో, ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయపాలనను కూడా పునరుద్ధరించారు అధికారులు.. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తాయని ప్రకటించారు.. కొన్ని రూట్లలో ప్రయాణికుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో తరచూ సర్వీసులను రద్దు చేస్తూ వచ్చారు.. ప్రస్తుతం రద్దీ పెరగడంతో.. యథావిధిగా అర్ధరాత్రి వరకూ సర్వీసులు నడపాలని నిర్ణయించారు అధికారులు.. ప్రస్తుతం ప్రతి రోజు 86 సర్వీసులు నడిపిస్తున్నారు.. బస్సు ఛార్జీలతో పోలీస్తే.. ఎంఎంటీఎస్‌ ఛార్జీలు చాలా తక్కువ కావడం కూడా కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు.