MMTS Services: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. సర్వీసులు పెంచిన ఎంఎంటీఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్ చెప్పింది ఎంఎంటీఎస్.. కరోనా ఆంక్షలు, ప్రయాణికుల రద్దీ కూడా లేకపోవడంతో.. కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా కొద్ద సర్వీసులను మాత్రమే నడుపుతూ వస్తున్నారు అధికారులు.. అయితే, ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడానికి తోడు.. ప్రయాణికుల రద్దీ కూడా పెరగడంతో.. క్రమంగా సర్వీసులను పెంచుతూ వస్తున్నారు అధికారులు.. వర్క్ ఫ్రమ్ హోం ఎత్తివేసి.. ఐటీ సంస్థలు కూడా చాలా వరకు పునరుద్ధరించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారి సంఖ్య పెరిగింది.. సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగుల కార్యాలయాలకు వెళ్తుండడంతో రద్దీ పెరిగింది. ఇక, ప్రయాణికుల డిమాండ్ పెరగడంతో.. సర్వీసులను కూడా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.
Read Also: Tulasi Reddy: నా ఇష్టం నా రాజ్యాంగ అన్నట్లు జగన్ వ్యవహారం..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
మరోవైపు భారీగా పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు కూడా ప్రయాణికులు ఎంఎంటీఎస్‌ను ఆశ్రయించేలా చేసినట్టుగా తెలుస్తోంది.. దీంతో, ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనను కూడా పునరుద్ధరించారు అధికారులు.. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని ప్రకటించారు.. కొన్ని రూట్లలో ప్రయాణికుల నుంచి డిమాండ్ లేకపోవడంతో తరచూ సర్వీసులను రద్దు చేస్తూ వచ్చారు.. ప్రస్తుతం రద్దీ పెరగడంతో.. యథావిధిగా అర్ధరాత్రి వరకూ సర్వీసులు నడపాలని నిర్ణయించారు అధికారులు.. ప్రస్తుతం ప్రతి రోజు 86 సర్వీసులు నడిపిస్తున్నారు.. బస్సు ఛార్జీలతో పోలీస్తే.. ఎంఎంటీఎస్ ఛార్జీలు చాలా తక్కువ కావడం కూడా కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!