Site icon NTV Telugu

MLC VG Goud : మధు యాష్కీ ఒక పొలిటికల్ టూరిస్ట్

TRS MLC Vullolla Gangadhar Goud Made Comments on Congress Leader Madhu Goud Yashki.

ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ పరిస్థితి వేడెక్కింది. ఇటీవల రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు కల్వకుంట్ల కవిత ఎన్నికల్లో చేసిన వాగ్దాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్‌ చేస్తూ.. మాట తప్పారంటూ.. ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేత మధుయాష్కీ కూడా ట్విట్టర్‌ వేదికగా ఎమ్మెల్సీ కవితకు కౌంటర్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వుల్లోల గంగాధర్‌ గౌడ్‌ (వీకే గౌడ్‌) మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితపై విమర్శించే హక్కు మాజీ ఎంపీ మధుయాష్కీకి లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా మధు యాష్కీ ఒక పొలిటికల్ టూరిస్ట్ అంటూ విమర్శించారు. మధు యాష్కీకి తెలంగాణలో అసలు ఎం జరుగుతుందో తెలియదని, నీకు ఎమ్మెల్సీ కవిత మీద మాట్లాడే అర్హత లేదంటూ అగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీతో కుమ్మక్కయావని, డిపాజిట్ కూడా దక్క లేదన్నారు. రేవంత్ రెడ్డి, మధు యాష్కీ లది ఐరన్ లెగ్ అని, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడే షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసారన్నారు. పసుపు బోర్డు కోసం కేంద్రంలో ప్రభుత్వం లేకున్న ముఖ్యమంత్రులతో లేఖలు ఇప్పించిన ఘనత కవితదని ఆయన వెల్లడించారు. నువ్వు సపోర్ట్ చేసిన అరవింద్ బాండ్ పేపర్ తీసుకోని మోసం చేసాడని, దాని పై మాట్లాడు అంటూ ధ్వజమెత్తారు. మరోసారి ఎమ్మెల్సీ కవితపై మాట్లాడితే నిజామాబాద్‌లో ప్రజలు మిమ్మల్ని తిరగనివ్వరని హెచ్చరించారు.

https://ntvtelugu.com/once-again-tollywood-drugs-case-interrogation/
Exit mobile version