NTV Telugu Site icon

Padi Kaushik Reddy: ఈటల రాజేందర్‌కి ఎమ్మెల్సీ కౌశిక్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పాలని డిమాండ్

Kaushik On Etela

Kaushik On Etela

MLC Padi Kaushik Reddy Questions Etela Rajender Over Journalists Lands Issue: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఓ సూటి ప్రశ్న సంధించారు. నీ హుజూరాబాద్ నియోజకవర్గ జర్నలిస్టులకు ఎందుకు స్థలాలు కేటాయించలేదని అడిగారు. ఇందుకు తప్పకుండా సమాధానం చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌశిక్ మాట్లాడుతూ.. ఈరోజు ఒక వింత చోటు చేసుకుందని, దీని గురించి ప్రజలందిరికీ తెలియాలనే ఉద్దేశంతోనే తాను మీడియా సమావేశాన్ని నిర్వహించానని అన్నారు. హైదరాబాద్‌లో మీడియా ధర్నా కార్యక్రమంలో ఈటల రాజేందర్ మాట్లాడారని, ఇదే ఆ వింత అని వివరించారు.

Prabhas: బావ.. అన్ని వుడ్స్ అయిపోయాయి.. ఇక హాలీవుడ్ కు ఎంట్రీ ఇద్దామా..?

రాష్ట్రమంతా పక్కనపెడితే.. మంత్రిగా ఉన్నప్పుడు హుజురాబాద్ నియోజకవర్గ జర్నలిస్టులకు స్థలాలు ఎందుకు ఇవ్వలేదని ఈటలని కౌశిక్ నిలదీశారు. తాను జర్నలిస్టుల తరుపున ప్రశ్నిస్తున్నానన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల ఇవ్వకపోయినా.. కమలాపుర్‌లో వారికి స్థలాలిచ్చిన ఘటన సీఎం కేసీఆర్‌ది అని తెలిపారు. ఇక్కడ ఇవ్వకుండా ఇంకా ఎన్ని రోజులు కమలహాసన్ యాక్టింగ్ చేస్తావని దుయ్యబట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకే ఒక మంత్రిగా ఉన్నప్పుడు.. అవకాశం ఉన్నా ఎందుకు స్థలాలివ్వలేదన్నారు. తాము హుజూరాబాద్‌ల జర్నలిస్టులకు తప్పకుండా స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈటల జీవితం ఒక మోసమని.. దొంగే దొంగ అని అరిచినట్లు ఈటల వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీలో బ్లాక్‌మెయిల్ చేసి.. రాష్ట్ర అధ్యక్షున్ని మార్చిన ఘనత ఈటలది అని ఆరోపించారు.

Chain Snatching Batch: చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్.. 8 తులాల బంగారం స్వాధీనం