Site icon NTV Telugu

MLC Kavitha: హైదరాబాద్‌లో సంక్రాంతి వేడుకలు.. భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: హైదరాబాద్‌లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ భోగి పండుగ కావడంతో.. నగరంలో భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి మంటల చుట్టూ యువతులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా భోగిని ఆశ్వాదిస్తున్నారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

Read also: Jabardasth Varsha: వర్ష నీ డ్రస్‌ అక్కడ చిరిగింది.. తెలిసే వేసుకున్నావా?

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి.. కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ఉద్దేశమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాగా.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను అందరం ఘనంగా జరుపుకుంటామన్నారు. ఇక.. హైదరాబాద్‌లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా.. మనలోని ప్రతికూలతలను విడిచిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్దామన్నారు. ఈసందర్భంగా.. తెలంగాణ జాగృతి నుంచి భారత్‌ జాగృతిగా రూపాంతరం చెందాక మొదటి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు కవిత..పల్లెవాతావరణాన్ని నగరానికి తీసుకొచ్చిన హైదరాబాద్‌ జాగృతివారిని అభినందించారు ఆమె భోగి వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
Bhogi: తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు.. ఇంటింటా భోగి మంటలు

Exit mobile version