MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాలుకు ఫ్రాక్చర్ అయింది. మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తనకు కాలు ఫ్రాక్చర్ అయిందని, మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారని పోస్ట్‌లో రాశాడు. అయినప్పటికీ, ఏదైనా సహాయం లేదా కమ్యూనికేషన్ కోసం తన కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఫ్రాక్చర్ ఎలా జరిగిందనే విషయాన్ని కవిత తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించలేదు. ఆమె చేసిన ట్వీట్‌కు నెటిజన్లు గెట్ వెల్ వెల్ సూన్ అంటూ రిప్లై ఇస్తున్నారు. ఫ్రాక్చర్ వల్ల ఇబ్బందుల్లో ఉన్నా కానీ.. అవసరమైన వారికి అందుబాటులో ఉంటానని పెద్ద మనసు చూపిస్తున్నావు అక్కా.. నువ్వు త్వరగా కోలుకోవాలని మరో నెటిజన్ కోరాడు. ఎలా జరిగిందని కొందరు అడుగుతున్నారు.
Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks.
My @OfficeOfKavitha shall be available for any assistance or communication.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023
ఇటీవల ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్నారు. తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చి తొలి ఉద్యమం మహిళా రిజర్వేషన్ అంశాన్ని చేపట్టింది. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష నిర్వహించగా దాదాపు 18 పార్టీలు, మహిళా సంఘాలు, సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి ప్రచారంలో భాగంగా మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని ప్రారంభించి, దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నారు. ఈ నెలలోనే ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు కవిత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మహిళా బిల్లుకు మద్దతివ్వాలని దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనాపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు పంపిస్తామన్నారు. మహిళలకు సాధికారత కల్పిస్తాం, దేశానికి సాధికారత కల్పిస్తాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ప్రచారం ప్రారంభించాలన్నారు. అయితే మూడు వారాలుగా బెడ్ రెస్ట్ అవసరం కావడంతో ఈ ఉద్యమ కార్యక్రమాలన్నీ వాయిదా పడినట్లు భావిస్తున్నారు.
live life comfortably: ఆ దేశంలో అన్నీ ఉచితమే.. జీవితాన్ని హాయిగా గడపండి