MLC Kavitha : ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీసీలంటే నాలుగైదు కులాలు మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా అంతర్గతంగానే మాట్లాడాలని, బీసీలకోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్సీ కవిత. వృత్తిపనులకు చేయూత ఇచ్చే కార్యక్రమాలు చేశామని, రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్ ఎత్తేసిన తర్వాత బీసీ ఉద్యమం ఊపందుకుందన్నారు కవిత.
Dimple Hayathi: శారీలో చందమామలా.. డింపుల్ పిక్స్ చూడాల్సిందే!
మహిళల విషయాలు మహిళలే మాట్లాడాలి అంటే సమస్యలు పరిష్కారం కావని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం నుంచి అనేక అంశాలపై పోరాడుతూనే ఉన్నానని, అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకోసం 48 గంటల దీక్ష చేశానని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు కోసం పోరాటం చేశామని ఆమె తెలిపారు. ఇప్పుడు బీసీల కోసం పోరాటం చేస్తున్నా అని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.
