Site icon NTV Telugu

MLC Kavitha: ఎంపీ అరవింద్‌ కు 24గంటలు టైం.. లేదంటే ముక్కు నేలకు రాయాలి కవిత సవాల్‌..

Mlc Kavitha Arvind Kumar

Mlc Kavitha Arvind Kumar

MLC Kavitha: ఎంపీ అర్వింద్ పిచ్చి ప్రేలాపణలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల సమయం ఇస్తా ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే ముక్కు నేలకు రాయాని ఎమ్మెల్సీ కవిత సవాల్‌ విసిరారు. బీఆర్ఎస్ లో అన్ని సింహాలే, కొన్ని పార్టీల్లో గ్రామ సింహాలు ఉన్నాయని తెలిపారు. ఎంపీ అర్వింద్ బాల్కొండలో అతిగా అసభ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పాలని అన్నారు. తెలంగాణలో సంపద సృష్టించం అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. బీజేపీ కాంగ్రెస్ పాలనలో అవినీతి జరగలేదా..? అని ప్రశ్నించారు. అండర్ గ్రౌండ్ డ్రైనెజీ డబ్బులు ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలుసని చురకలంటించారు. ఎంపీ అర్వింద్ పిచ్చి ప్రేలాపణలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల సమయం ఇస్తా ఆరోపణలు నిరూపించు, లేకపోతే ముక్కు నేలకు రాయాని సవాల్‌ విసిరారు. పేదల పక్షాన ఉండే పార్టీ బి ఆర్.ఎస్. పార్టీ అన్నారు. కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ, డి.ఎన్.ఏ. బి.ఆర్.ఎస్. తో మ్యాచ్ కాదని అన్నారు. బంపర్ మెజార్టీ తో మళ్ళీ గెలుస్తాం, సర్వేల్లో కాంగ్రెస్ మా దారి దాపుల్లో లేదని అన్నారు. ధరణి మా పాలసీ, దళారులు మా పాలసీ అని అన్నారు.

Read also: MLC Kavitha: కేటీఆర్ చేతుల మీదుగా ఈనెల 29న ఐటి హబ్ ప్రారంభం

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. ఈనెల (జూలై) 13న బాల్కొండలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని అరవింద్ ఆరోపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాల్కొండలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఎంపీ అరవింద్ అన్నారు. బత్తాపూర్‌లో శ్రీకాంత్‌, వంశీరెడ్డి అక్రమంగా క్వారీ క్రషర్‌లను నడుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఐదేళ్లపాటు నడిచిందని అన్నారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంట్ బిల్లు రూ.51 లక్షలు చెల్లించకపోతే విద్యుత్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. సామాన్యుడు కరెంటు చార్జీ రూ.2వేలు చెల్లించకపోతే కరెంటు కోత తప్పదన్నారు. దీనికి మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

America: రష్యాపై అమెరికా క్లస్టర్‌ ఆయుధాలు.. ఉపయోగిస్తున్న ఉక్రెయిన్‌

Exit mobile version