NTV Telugu Site icon

MLC Kavitha: మంథనిలో కవిత పర్యటన.. పెద్దపల్లిలో రోడ్‌షో

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు పెద్దపల్లి, మంథనిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు మంథని నియోజకవర్గంలోని కాటారంలోని గారేపల్లిలోని ప్రతిపాదిత మినీ స్టేడియంలో, సాయంత్రం 4 గంటలకు రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని వాణి సూల్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలకు కవిత పాల్గొని ప్రసంగిస్తారు. మంథని బీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్టా మధుకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు జక్కు శ్రీహర్షిణి, మంథని బాలదియ అధ్యక్షురాలు పుట్టా శైలజ నేతృత్వంలో పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read also: Minister KTR: నేడు భద్రాద్రిలో కేటీఆర్‌ పర్యటన.. రామాలయ దర్శనం, రోడ్ షో

అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలకడంతో పాటు బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌, మహాముత్తారం, మహదేవ్‌పూర్‌, పమెల, మల్హర్‌, కాటారం మండలాల్లో ప్రజలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కోరుతున్నారు. మంథనిలో సందర్శనానంతరం సాయంత్రం 5:30 గంటలకు పెద్దపల్లికి చేరుకుంటారు. పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ఇక్కడ రోడ్ షో నిర్వహించి జెండా కూడలిలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు. నగరంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. మండలంలోని సెంటినరీ కాలనీ వాణి సెకండరీ పాఠశాల మైదానాన్ని గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్‌రావు పరిశీలించారు.
Minister KTR: నేడు భద్రాద్రిలో కేటీఆర్‌ పర్యటన.. రామాలయ దర్శనం, రోడ్ షో