Kadiyam Srihari: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపణలకు కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kadiyam Srihari Counter To MLA Thatikonda Rajaiah Comments: వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో.. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మొదట్నుంచే వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా.. కాలక్రమంలో అది ముదురుతూ వచ్చింది. ఇప్పుడు ఆ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఒకరిపై మరొకరు చేసుకున్న తీవ్ర వ్యాఖ్యలే అందుకు కారణం. తొలుత ఆదివారం నిర్వహించిన ఓ సమావేశంలో.. కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో 361 మంది మావోయిస్టులు బలి అయ్యారని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ తన అడ్డా అని.. ఇక్కడ ఎవరినీ అడుగుపెట్టనివ్వబోనని శపథం చేశారు. అంతేకాదు.. ఎమ్మెల్సీలతో అభివృద్ధి జరగదని, ఎమ్మెల్యేలతోనే జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేల ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ప్రభుత్వం ఏర్పడాలన్నా.. ఎమ్మెల్యేలే ఉండాలన్నారు.
రాజయ్య చేసిన ఆ వ్యాఖ్యలతో నొచ్చుకున్న కడియం శ్రీహరి.. తాజాగా వాటికి బదులిచ్చారు. పెన్షన్ పంపీణీ కార్యక్రమంలో మాట్లాడిన రాజయ్య.. ఆ వేదికను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాజయ్య తీవ్రమైన నిరాశ, నిస్పృహలో ఉన్నారని.. ఆయన ప్రజల మద్దతును కోల్పోతున్నారని.. మతిస్థిమితం కోల్పోతున్నారని దుయ్యబట్టారు. ఆ వ్యాఖ్యల్ని రాజయ్య బేషరుతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘నీ కంటే ముందు మూడుసార్లు ప్రాతినిధ్యం వహించాను. అలాంటి నాపైనే తీవ్ర ఆరోపణలు చేస్తావా? అంటూ రాజయ్యను నిలదీశారు. రాజయ్యకు ఏదైనా సమస్య ఉంటే అధిష్టానికి చెప్పుకోవాలని, అంతే తప్ప అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. రాజయ్య విజయం కోసం తామెంతో కష్టపడ్డామని.. స్టేషన్ ఘన్పూర్ ఎవరి అడ్డా, జాగీరు కాదని తేల్చి చెప్పారు. ‘నాలుగు సార్లు గెలిచి, నియోజకవర్గానికి ఏం చేశావు?’ అంటూ ప్రశ్నించారు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఓళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. భారతదేశంలో ఉపముఖ్యమంత్రిగా భర్తరఫ్ అయిన మొదటి వ్యక్తి నువ్వేనని, అప్పుడు స్టేషన్ ఘన్పూర్ పరుపు పోలేదా? అని ఎద్దేవా కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.
Also Read
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!