MLC Jeevan Reddy: అలిగారు..అంటీముట్టడంలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ MLCని పాత గాయం వెంటాడుతూనే ఉంది. ఇంకా కోలుకో లేదు. పార్టీలో అన్నింటికీ ముందుండే పెద్దాయన ఇప్పుడు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తన పనెంటో తాను చూసుకుని వెళ్లిపోతున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన ఎందుకు అలిగారు?
కాంగ్రెస్ కార్యక్రమాలకు టచ్ మీ నాట్‌గా జీవన్‌రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి. పార్టీకి విధేయుడు. ప్రస్తుతం ఎమ్మెల్సీ. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై పోటీ చేయడానికి పార్టీ నుంచి ఎవరూ ముందుకురాని సమయంలో మంత్రి పదవిలో ఉండి ఆయనపై పోటీ చేశారు. అలాంటి జీవన్‌రెడ్డి కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు టచ్‌మీ నాట్‌గా ఉంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో జరిగే ప్రతిచర్చలో జీవన్‌రెడ్డి ఉండేవారు.. ఇప్పుడు జీవన్‌రెడ్డి పార్టీలో ఉన్నారో లేరో కూడా తెలియనంతగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
- Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
అప్పట్లో పీసీసీ చీఫ్ జీవన్‌రెడ్డి అంటూ లీకులు
పీసీపీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో.. రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులంతా.. జీవన్‌రెడ్డిని సమర్ధించారు. సరిగ్గా అదే సమయంలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక వచ్చింది. దీంతో మాజీ మంత్రి జానారెడ్డి జోక్యం చేసుకుని.. పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను ఆపించారు. జానా కోరడం.. కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించడం చకచకా జరిగిపోయింది. ఆ సమయంలో పీసీసీ చీఫ్‌గా జీవన్‌రెడ్డి పేరు ఖరారైనట్టు.. అందుకు సోనియాగాంధీ ఆమోదం తెలిపినట్టు లీకులు వచ్చాయి. కానీ.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ రేస్‌లో జీవన్‌రెడ్డి పేరు లేకుండా పోయింది. అప్పటి నుంచి జీవన్‌రెడ్డి అసంతృప్తితోనే ఉంటున్నారు.
గాంధీభవన్‌కు దూరం
మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి వయసు మీద పడింది అని కొందరు.. రెడ్డి సామాజికవర్గం కూడా ఆయన్ని ఓన్ చేసుకోదని మరికొందరు కాంగ్రెస్ అధిష్ఠానానికి చెప్పినట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వాటిని జీవన్‌రెడ్డి ఇప్పటికీ ప్రస్తావిస్తూనే ఉన్నారు. గతంలో గాంధీభవన్‌లో ఏ కార్యక్రమం జరిగినా వచ్చే ఆయన.. ఇప్పుడు రావడమే మానేశారు. ఆ మధ్య గాంధీభవన్‌లో పార్టీ సమావేశం జరుగుతుంటే.. అసెంబ్లీలో ప్రెస్‌మీట్ పెట్టి వెళ్లిపోయారు తప్ప.. అక్కడికి వెళ్లలేదు.
జగిత్యాల, చొప్పదండి, ధర్మపురికే పరిమితం
ప్రస్తుతం సొంత జిల్లాలోని చొప్పదండిలో పార్టీ నేత మేడిపల్లి సత్యం.. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్‌ల కోసం పనిచేస్తున్నారు జీవన్‌రెడ్డి. ఈ రెండు నియోజకవర్గాలతోపాటు జగిత్యాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు నిర్వహిస్తున్న సమావేశాలకు కానీ.. ఇతర ఏ విషయాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు మాజీ మంత్రి. రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా ప్రకటిస్తున్న సమయంలో AICC రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఫోన్ చేశారట. ఆ సమయంలో ఠాగూర్‌పై జీవన్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయినట్టు చెబుతారు. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి.. అన్నీ మాకు చెప్పి చేస్తున్నారా అని ఇంఛార్జ్‌ను నిలదీశారట. తత్వం బోధపడిన ఠాగూర్ సైలెంట్‌గా ఉండిపోయారట.
ఒక పెద్దాయన ఫోన్‌తో పదవి రాలేదన్న ఆవేదన
పీసీసీ చీఫ్ ఎంపిక తర్వాత జీవన్‌రెడ్డి పార్టీ లైన్లోనే ఉన్నా.. పాత గాయం నుంచి ఇంకా కోలుకో లేకపోతున్నారని సమాచారం. తనే పీసీసీ చీఫ్ అని ప్రకటించే సమయంలో ఒక పెద్దాయన ఫోన్‌తో ఆ పదవి రాలేదన్న ఆవేదనలో ఉన్నారట జీవన్‌రెడ్డి. ఆ విషయాన్ని ఎవరు కదిలించినా.. పాత గాయాన్ని చెప్పుకొంటున్నారట మాజీ మంత్రి. ఆ సంగతి ఎలా ఉన్నా.. కొందరు పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పిన మాటలే మరింత గాయం చేస్తున్నాయట.
తాజావార్తలు
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..