Site icon NTV Telugu

TPCC vs Jeevan Reddy: పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారు.. ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి..

Jeevan

Jeevan

TPCC vs Jeevan Reddy: కాంగ్రెస్ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని నమ్మకంగా ఉన్న మారు గంగారెడ్డి వ్యక్తిని జాబితాపూర్ గ్రామంలో సంతోష్ అనే వ్యక్తి కత్తులతో పొడిచి హతమార్చడు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. సంతోష్ వెనుక బలమైన శక్తులు ఉండి ఈ నేరాన్ని చేయడానికి ప్రలోభ పెట్టారు అని తెలిపారు. నిందితుడి వెనక ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారు కాబట్టే ఇలాంటి దారుణం జరిగింది అని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: CRPF Schools: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా CRPF పాఠశాలలపై బాంబులు వేస్తామంటూ బెదిరింపులు

ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించదు అనుకున్నాను అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ, గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పని చేసిన వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది.. జగిత్యాల జిల్లాలో మా కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుంది.. మేము అవమానలకు గురవుతున్నాం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది.. వెంటనే ఈ నేరానికి పాల్పడ్డ వారిని.. వారి వెనక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Exit mobile version