NTV Telugu Site icon

MLC Jeevan reddy: జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రోళ్లు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారు

Mlc Jeevanreddy

Mlc Jeevanreddy

MLC Jeevan reddy: ఆంధ్రావాళ్లు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆత్మహత్యకు పాల్పడ్డ నవీన్ కుటుంబాన్ని జీవన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది ఎండ్లలో 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ ఐదు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరిపై లక్ష 25వేల అప్పు చేశారని అన్నారు. కాలువల ద్వారా నీరు అందించడమే లక్ష్యంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని తెలిపారు. కేటీఆర్ పదోన్నతి పొందాడు కానీ తన ఇలాకాలో ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆరోపించారు.

సాప్ట్ వేర్, హార్డ్ వేర్ రంగంలో తెలంగాణ నిరుజ్యోగులు 10 శాతం వరకు మాత్రమే ఉన్నారన్నారు. ఉపాధి లేకపోవడం వల్ల నిరుద్యోగి నవీన్ బలవన్మరణం చేసుకున్నాడని అన్నారు. ప్రైవేటు సెక్టర్లలో ఉద్యోగాలు కల్పిస్తే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో ప్రత్యేక చట్టం పెట్టీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. హైదరాబాదులో ఎంతో స్కోప్ ఉన్న ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్నారు. పేపర్ లీకేజీల వల్ల అనర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. ఆంధ్రావాల్లు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారని, పబ్లిక్ కమిషన్ నిర్లక్షం వల్ల పేపర్ లీకేజీ జరిగిందని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మిత్రపక్షం ఉన్నప్పుడు 2017లో అవుట్ సోర్చింగ్ లో కొందరు ఉద్యోగాలు సంపాదించారని అన్నారు. ఇప్పుడు ఎంతో మంది ఉద్యోగం సాధించిన వారి పరిస్తితి ఏంటని ప్రశ్నించారు?. స్వతంత్రంగా నడిచే సంస్థ మాకు ఏం సంబంధం అని మంత్రి కేటీఆర్ అనడం అమానుషమన్నారు. పబ్లిక్ కమిషన్ సభ్యుల నియామకంలో ప్రభుత్వ పాత్ర ఉందా? లేదా? తేల్చి చెప్పాలని అన్నారు.

కల్వకుంట్ల కుటుంబసభ్యులను, అనుచరులను పబ్లిక్ కమిషన్ లో నియమించారని తెలిపారు. స్వతంత్రంగా నడిచే సంస్థ అయినప్పుడు, ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు, స్వయానా ముఖ్యమంత్రి నిన్న రివ్యూ ఎలా చేశారు? అని ప్రశ్నించారు. లక్షల రూపాయలు తీసుకొని పేపర్ లీకేజీ చేశారని ఆరోపించారు. పేపర్ లికేజీని కేటీఆర్ సమర్డిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఫోన్ చేసి తమ కుటుంబాన్ని ఆదుకుంటానని అన్నాడని నవీన్ కుటుంబ సభ్యులు అంటున్నారని తెలిపారు. బలవన్మరణానికి పాల్పడితే సమస్య ఉత్పన్నమైందని అన్నారు. కేటీఆర్ ఇలాకాలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించే అర్హత మీకు లేదు. ఒక్క నీరుజ్యోగి కూడా ఉండకుండా కనీసం పైవేటు రంగంలో ఉద్యోగం కల్పించాలన్నారు. నిరుద్యోగా భృతి ఇస్తానని నాలుగు సంత్సరాలయ్యిందని తెలిపారు. ఇంతవరకు ఇవ్వాళే.. నిరుజ్యోగా భృతి తక్షణమే అమలు చేయాలన్నారు. కమిషన్ లో వాస్తవాలు బయటకి రావాలంటే సీబీఐ చొరవ తీసుకోవాలని, సిట్టింగ్ హైకోర్టు విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. చైర్మన్ జనార్దన్ రెడ్డి నైతిక భాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, సభ్యులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
Crop destruction: రైతులను ముంచేసిన వర్షం.. జిల్లాల వారిగా పంట నష్టం