NTV Telugu Site icon

Jeevan Reddy: నీకో దండం.. నీ పార్టీకో దండం.. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

Jagithal

Jagithal

Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురి అయ్యాడు. ఈ కేసులో పోలీసుల అదుపులో నిందుతుడు సంతోష్ తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో నిందితుడిని ఉంచినట్టు తెలుస్తుంది. ఇక, నిందితుడు నుంచి హత్యకు గల కారణాలు, హత్య వెనక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కాంగ్రెస్ సీరియన్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ హత్యకు నిరసనగా రోడ్డుపై బైటాయించి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Read Also: Blast In Factory: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పది మందికి పైగా తీవ్ర గాయాలు

ఈ సందర్భంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో హాట్ కామెంట్స్ చేశారు. నేను ఎందుకు బ్రతకడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తాను అని వెల్లడించారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నాను.. నీకు నీ పార్టీకో దండం.. మమ్మలి ఇలా బ్రతకనివ్వండి అంటూ విప్ లక్ష్మణ్ తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మొర పెట్టుకున్నారు. అలాగే, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా నేను పార్టీలో ఉండలేను నన్ను క్షమించండి అని జీవన్ రెడ్డి తెలిపారు. నాలుగు దశబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. మహేష్ గౌడ్ మాట్లాడుతుండాగానే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోన్ కట్ చేసి విసిరేశారు.

Read Also: CWG 2026: కామన్వెల్త్ క్రీడల నుంచి 9 గేమ్స్ ఔట్.. లిస్ట్‌లో క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్!

అయితే, మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటికి వెళ్లి అన్ని రహదారులను పోలీసులు మూసి వేశారు. కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి హత్య నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీస్ పహారా కొనసాగుతుంది. ఈ సందర్భంగా జగిత్యాల ఎస్పీకి ఎమ్మెల్యే సంజయ్ ఫోన్ చేశారు. మారు గంగారెడ్డి హత్య పై ఆరా తీశారు. నింధితులను కఠినంగా శిక్షించాలని, హత్యలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలొద్దని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.

Show comments