Site icon NTV Telugu

ఈటల టీఆర్ఎస్ లో ఉన్నా బాగుండేది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మధ్యంతర పీఆర్సీ ఇస్తున్నారు. కానీ మన తెలంగాణలో మూడు పండగలు గడిచినా ఇంకా కొత్త పీఆర్సీ ఇవ్వలేదు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో మధ్యంతర బృతి కల్పించకపోవడంతో చాలామంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పీఆర్సీ పదవి విరమణ సమయంలో ఇస్త అనడం కేసీఆర్ కే చెల్లింది. ఈరోజు ఇవ్వాల్సిన పీఆర్సీ ఇరవై సంవత్సరాలు తర్వాత ఎంత అవుతుందో అందరికి తెలిసిందే.

ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కోసం ట్రై చేస్తుండు అని కేసీఆర్ ఆయన పై చేసిన పనిని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది అని తెలిపారు. మంత్రి మల్లరెడ్డి కాలేజ్, పువ్వాడ అజయ్ మెడికల్ కాలేజ్,కేటీఆర్ విలాసవంత ఫామ్ హౌస్ కూడా అక్రమణల మీదే కట్టారు. వాటిపై ఎందుకు ఎంక్వైయిరి చేయట్లేదు. కేసీఆర్ కుటుంబ ఆస్తులు అప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి. ఈటల తెరాస లోనే ఉన్నా బాగుండేది పోయి పోయి బీజేపీలో చేరిండు. ఎమ్మెల్యే కోసం ఇంత తాపాత్రేయం ఎందుకు. కేసీఆర్ తోనే ఉండి ఉంటే ఎమ్మెల్యే మంత్రి పదవులు ఉండేవికదా అని పేర్కొన్నారు.

Exit mobile version