Site icon NTV Telugu

MLC Jeevan Reddy : కేసీఆర్‌, మోడీ ఇద్దరూ దొంగలే

Mlc Jeevan Reddy

Mlc Jeevan Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిన్న తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆ తరువాత కేంద్రం ప్రభుత్వం, బీజేపీ నేతలపై నిప్పులు చేరిగారు కేసీఆర్‌.అంతేకాకుండా ప్రభుత్వం రద్దుకు సిద్ధమంటు వ్యాఖ్యానించారు. అయితే.. తాజాగా కేసీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఏకనాథ్‌షిండేనే తెచ్చింది… కేసీఆర్‌… ప్రతిపక్షం లో ఉన్న శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి ఇచ్చాడంటూ విమర్శలు గుప్పించారు.

Uttam Kumar Reddy : నెల రోజుల్లో స్క్రీనింగ్ కమిటీ నియామకం

ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు ఏక్‌నాథ్‌షిండేగా శ్రీనివాస్ యాదవ్ నీ తెచ్చావు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. దమ్ము ఉంటే.. ప్రభుత్వాన్ని రద్దు చేయంటూ జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ తో పాటు ఎన్నికలు పెట్టించే బాధ్యత నాది అని ఆయన వెల్లడించారు. దమ్ముంటే ప్రభుత్వం రద్దు చేసి రా అని జీవన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ఎన్నికలకు మేము సిద్దమన్న జీవన్‌ రెడ్డి.. కేసీఆర్‌..మోడీ ఇద్దరు దొంగలే అంటూ జీవన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తి చేశారు.

 

Exit mobile version