NTV Telugu Site icon

MLC Jeevan Reddy: బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీ దగ్గర కుదవపెట్టారు.. కేసీఆర్‌ పై జీవన్‌ రెడ్డి ఫైర్‌

Mlc Jevanreddy

Mlc Jevanreddy

MLC Jeevan Reddy: కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ని బీజేపీ దగ్గర కుదవపెట్టారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ని నిల్వరించడానికె బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నాయన్నారు. నిజామాబాద్ లో పోటీ చేయడం పద్మవ్యూహంలో చిక్కడమే అన్నారు. గెలిస్తే అర్జునుడిని ఓడితే అభిమాన్యుడిని అని తెలిపారు. గెలిచిన ఓడిన జగిత్యాల ప్రజల అభిమానం చాలు నాకు అన్నారు. రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల అని తెలిపారు. బీజేపీ పార్టీ సిద్ధాంతం, ఆర్థికప్రణాళిక లేని పార్టీ అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గాడపుకునే పార్టీ బీజేపీ అంటూ మండిపడ్డారు. బీజేపీ ఫలిత రాష్టాల్లో తెలంగాణ లో అమూల్యయే ఏ ఒక్క పథకం అయిన అమలవుతుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు దీక్షల పేరిట ధర్నాలు చేయడం దేయ్యలు వేదాలు వాళ్ళించినట్టు ఉందన్నారు.

Read also: Atrocious: ఆస్తికోసం తల్లి అంతక్రియలు ఆపేసిన కొడుకు.. మూడు రోజులుగా ఫ్రీజర్‌ లోనే డెడ్‌ బాడీ

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వరికి క్వింటల్ కు 3000 రూపాయల మద్దతూ ధర అందిస్తామన్నారు. కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ని బీజేపీ దగ్గర కుదపెట్టారన్నారు. బీజేపీ హస్తల్లో ఉన్న పార్టీ ని విడిపించడానికి కేసీఆర్ రైతు దీక్షలు అన్నారు. ప్రభుత్వం నిర్మాణత్మాకంగా వ్యవహారిస్తే ప్రతిపక్షాలు సహకరించాలన్నారు. ప్రజల దారిని మల్లించడానీకే కేసీఆర్ రైతు దీక్షలు అన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆ వరి వేస్తే ఉరి అన్నాడని గుర్తు చేశారు. రుణమాఫీ, వరి పంట కు బోనస్ అందించి రైతుల ను అదుకుంటామన్నారు. కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేసే విదంగా విధి విధానాలను రూపొందిస్తున్నారన్నారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా సన్న రకాలు ప్రోత్సహించేందుకు వరి పంట కు కి బోనస్ అందిస్తామని క్లారిటీ ఇచ్చారు.
Nellore Crime: నెల్లూరులో దారుణం.. పెళ్లికి నిరాకరించిన యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి