Site icon NTV Telugu

MLC Jeevan Reddy: ఆ.. ఏడు గ్రామాలను తెలంగాణలో కలపండి

Mlc Jeevan Reddy

Mlc Jeevan Reddy

MLC Jeevan Reddy: భద్రాచలం పక్కన ఉన్న 7 గ్రామాలను తెలంగాణలో కలపాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్‌ చేశారు. విభజన హామీలు ఒక్కటీ అమలు కావడం లేదని అన్నారు. Itir ప్రాజెక్టు కనుమరుగైందని విమర్శించారు. గిరిజన సమాజం తెలంగాణ వచ్చినప్పటి నుంచి అత్యధికంగా నష్టపోతుందని అన్నారు. కేంద్రం గిరిజనులకు 7.5% రిజర్వేషన్లు కల్పిస్తుంటే రాష్ట్రం మాత్రం 6% రిజర్వేషన్లు కల్పిస్తోందని మండిపడ్డారు. కృష్ణా నదీ జలాల పంపిణీ సక్రమంగా జరగడం లేదని అన్నారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్న.. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకోలేకపోతున్నామన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ విషయంలో రాజ్యాంగ బద్దంగా మాట్లాడటం లేదని పేర్కొన్నారు.

read also: Bandi Sanjay: సభలో ప్రధానిని ఫాసిస్ట్ అంటే తప్పులేదు.. మరమనిషి అంటే సస్పెండ్ చేస్తారా?

తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారు అని ప్రధాని ఎలా అంటారు? అని మండిపడ్డారు. అసలు తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు జీవన్‌ రెడ్డి. విభజన అంశాల అమలు కోసం మీతోనే మేము ఉంటామన్నారు. విభజన అంశాలపై అఖిల పక్షం ఏర్పాటు చేసి కేంద్రం దగ్గరకు వెళ్దామని తెలిపారు. బీజేపీ గురించి మాట్లాడకుండా టీఆర్ఎస్ చేతులెత్తేస్తోందని మండిపడ్డారు. కేంద్రం, రాష్ట్రంతో పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. భద్రాచలం పక్కన ఉన్న 7 గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేశారు.
Prepaid Card for Kamineni: కామినేని హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్‌కి ప్రిపెయిడ్ కార్డు

Exit mobile version