ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు లో పలు పిటిషన్ లు దాఖలయిన సంగతి తెలిసిందే. అన్ని పిటిషన్ లపై కౌంటర్ దాఖలు చేసింది సిట్..ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. అన్ని పిటిషన్ లపై నేడు మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు మరోసారి వాదనలు వినిపించనున్నారు నిందితుల తరపు న్యాయవాది ఉదయ్ హుల్లా.. సిట్ తరపున వాదనలు వినిపించారు సీనియర్ లాయర్ దవే. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
Read Also: Kunamaneni Sambasivarao: రేపు రాజ్ భవన్ ముట్టడి.. ఎందుకంటే?
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని వాదించారు. నిందితులు ముగ్గురు అడ్డంగా దొరికిపోయారని, TRS పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలనుకున్నారని సిట్ తరఫున వాదించారు సీనియర్ లాయర్ దవే. సిట్ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయని తెలిపారు. ఇదిలా వుంటే ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో న్యాయవాది శ్రీనివాస్ కి ఊరట లభించింది. ఈ కేసులో నలుగురిపై దాఖలైన మెమోలు కొట్టివేసింది కోర్టు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది. బీజేపీ నేత బీఎల్ సంతోష్, తుషార్, కేరళకు చెందిన జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమో తిరస్కరణకు గురైంది. నలుగురిని నిందితులుగా చేరుస్తూ గత నెల 22న నాంపల్లి అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టులో మొయినాబాద్ పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు.. మెమోను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.దర్యాప్తు పేరుతో సిట్ అధికారులు వేధిస్తున్నారని.. న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Read Also: Tamannaah: ఎట్టకేలకు పెళ్లి గురించి ఓపెన్ అయిన మిల్కీ బ్యూటీ