MLA Sanjay Kumar Requests People To Give Him Another Chance: జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇదే తన ఆఖరి పోటీ అని, మరోసారి ఛాన్స్ ఇవ్వాలని జగిత్యాల ప్రజల్ని కోరారు. మరోసారి పోటీ చేసే ఆలోచన తనకు లేదని, జీవన్‌రెడ్డిలాగా తాను మాట మార్చనని పేర్కొన్నారు. జగిత్యాలలో నిర్వహించిన రైతు వేదికగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మరోసారి తనకే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉందని, మీరందరు ఆశీర్వదిస్తే తిరిగి ఎమ్మేల్యేగా పోటి చేస్తానని తెలిపారు. తన మాట, బాట ఒక్కటే ఉంటుందని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో ఇదే తన చివరి ఎన్నిక అంటూ జీవన్ రెడ్డి ప్రజల ముందు ప్రకటించి గెలిచారని.. కానీ ఆయన మాట మార్చి తిరిగి 2018 ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేశారు. అప్పుడు మీరు నన్ను భారి మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించారని పేర్కొన్నారు.
Indrakaran Reddy: రైతులు మంచిగా బతుకుతుంటే.. కాంగ్రెస్‌కు కడుపుమంటగా ఉంది
ఇప్పుడు మరోసారి జీవన్ రెడ్డినో, అతని కొడుకో, ఇంకెవరో పోటీ చేసేందుకు రంగంలోకి దిగుతున్నారని.. మరోసారి తనకు ఛాన్స్ ఇచ్చి గెలిపించాలని సంజయ్ కుమార్ కోరారు. ఇదే చివరి ఎన్నిక అనే ఆలోచన పంచుకునే వేదిక ఇది కాకపోయినా.. ప్రజల ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని స్పష్టం చేశారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కావాలా? నిరంతర ఉచిత విద్యుత్‌తో పాటు సాగునీరు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? అని ప్రశ్నించారు. గతంలో కరెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టిందని.. మోసకారి కాంగ్రెస్‌కు ఛాన్స్ ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. ఉచిత కరెంట్‌తో పాటు చెక్ డ్యాం నీళ్లు, కాలువ నీళ్ల పుణ్యమా అని.. తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందని.. పంటలు పెరిగాయని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
V Hanumantha Rao: పప్పు అన్నారు, ఇప్పుడదే రాహుల్ పప్పా అయ్యాడు.. వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు