mla redya naiks son made sensational comments: డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తనయుడు రవి చంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డోర్నకల్ కు రాజకీయ టూరిస్ట్ లు వస్తున్నారు జాగ్రత్త అంటూ వ్యాఖ్యానించారు. డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ మనుసులో ఉంటేనే పని అవుతుంది. ఆయన ఆశీస్సులు ఉంటేనే నాయకులు, ప్రజాప్రతినిధులు అవుతారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రెడ్యానాయక్ ను గెలిపించి కేసీఆర్ ఆశీస్సులతో రెడ్యానాయక్ ను మంత్రిని చేయడానికి యువతకు సారధిగా నేను ముందు నడుస్తా అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. నాన్న వద్దు అనుకున్నప్పుడే నేను మీ..ముందుకు ఎన్నికల బరిలోకి వస్తా.. అప్పటివరకూ నాకు బరిలో ఉండాలన్న ఆలోచన లేదని రెడ్యానాయక్ కుమారుడు రవి చంద్ర నాయక్ అన్నారు. తన తండ్రి రెడ్యానాయక్‌ని మరోసారి ఎమ్మెల్యేని చేస్తే మంత్రి అవుతారని డీఎస్ రవిచంద్ర అన్నారు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ని, ఇటు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ని ప్రజలు మరిచే పరిస్థితి లేదన్నారు. దీంతో..బాగా మాట్లాడావంటూ ఎమ్మెల్యే తన కుమారుడికి కితాబిచ్చారు.. కార్యాలయ ప్రారంభానికి ముందుకు గ్రామ ప్రజలు అధికారులు, నేతలకు ఘన స్వాగతం పలికారు.
Read also: Weight Loss : బంపర్ ఆఫర్.. బరువు తగ్గితే రూ.1000కోట్ల బహుమతి
మహబూబాబాద్ జిల్లా కురవి, డోర్నకల్ మండలాల్లోని 17 గ్రామాలతో ఏర్పడిన సీరోలు మండల నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ.. గత ఎంపీటీసీ ఎన్నికల్లో తానిచ్చిన హామీ మేరకు దీన్ని మండలం చేయాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడమే కాదు శాసనసభలోనూ ప్రస్తావించినట్లు తెలిపారు…సీరోలు మండలం అవసరాలు తీరుస్తానని మాటిచ్చారు…ప్రజాసేవకు అంకితమైన నాయకులకు ప్రజల్లో విశ్వసనీయత ముఖ్యమన్నారు… ఇక, నియోజకవర్గ ప్రజలతో నిత్యం మమేకం కావడం వల్లే తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు వివరించారు… గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై తండాల్లో విస్తృత ప్రచారం చేయాలని కోరారు.
Corona Virus: బీ అలర్ట్.. బీఎఫ్-7 వేరియంట్ రూపంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా