MLA Redya Naik: హైదరాబాద్ లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Redya Naik: హైదరాబాద్ లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అసెంబ్లీ మీడియా పాయింట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రెడ్యానాయక్. డోర్నకల్ లో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడాడు అంటూ మండి మండిపడ్డారు. నేను, నా కూతురు ఎటువంటి భూముల కోసం పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు 20 ఏళ్ళు భవిష్యత్ లేదు.. రాబట్టే బీఆర్ఎస్ లో చేరామని తెలిపారు. హైదరాబాద్ లో మాకు సెంటు భూమి లేదని, గతంలో కొంత భూమి కొని..తర్వాత అమ్మేసామన్నారు. గతంలో ఇదే భూమిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే. రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. రేవంత్ రెడ్డి నిరూపించకుంటే 10 చెప్పు దెబ్బలు తింటడా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డోర్నకల్ ప్రజలకు నా నీతి నిజాయితీ తెలుసన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మేలర్ అన్నారు. పీసీసీ పదవిని డబ్బుతో కొనుక్కున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ను రేవంత్ భ్రష్టు పట్టించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పీసీసీ అయిన తర్వాత వచ్చిన రెండు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారని తెలిపారు. రంగులేసినోడు వేల కోట్లకు శ్రీమంతుడు ఎలా అయ్యాడు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Revanth Reddy: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం.. కేసీఆర్‌కు ఇచ్చిన అవకాశం ముగిసింది..
Also Read
అసెంబ్లీ మీడియా పాయింట్ లో..మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వాల్మీకి బోయలను కొన్ని రాష్ట్రాలు యస్టీ, యస్సీ జాబితాలో చేర్చాయన్నారు. ఉమ్మడి ఏపీలో ఎస్టీలో చేర్చాలని ఉధ్యమాలు జరిగాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చెల్లప్ప కమీషన్ ఏర్పాటు చేసామని, కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. తదుపరి పక్రియ కేంద్రం పరిధిలో ఉందని తెలిపారు. 1956 నుంచి వాల్మికి, బోయలు ఉధ్యమం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించని, బోయలకు న్యాయం చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ మాట్లాడుతూ.. వాల్మీకి, బోయల తరుపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. బాంబులతో పేల్చేస్తామని రేవంత్, గుమటాలను కూల్చేస్తామని బండి సంజయ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీడియాలో ప్రచారం కోసం ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు మెచ్యూరిటీ లేదన్నారు. బండిసంజయ్, రేవంత్ వాఖ్యలను సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కేసీఆర్ నిర్మిస్తే.. ప్రతిపక్ష నేతలు కూల్చేస్తామని చెప్తున్నారని మండిపడ్డారు. దాడులు చేయడానికి వెనకాడమన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..