MLA Raghunandan : తల్లిని చెల్లిని గౌరవించలేని భాష టీఆర్‌ఎస్‌ది
తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి బీజేపీని బద్నం చేయాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితలు చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, మోడీ తెలంగాణకి వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారని, తల్లిని చెల్లిని గౌరవించలేని భాష టీఆర్‌ఎస్‌ది అని ఆయన విమర్శించారు. ఉత్తర భారతం, దక్షిణ భారతం అన్న ప్రకాష్ రాజ్, కమలహాసన్ లు ఒడి పోయారని, ఉత్తర భారతనికి చెందిన బీజేపీ ఎంపీలు ఓటు వేస్తేనే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిందని ఆయన గుర్తు చేశారు. 22 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులకు కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేస్తున్నారని ఆయన అన్నారు.
అరె సన్నాసుల్లారా మీరు రాజకీయాలలోకి రాకముందే మోడీ ఒక రాష్ట్రానికి సీఎం.. సీఎంతో మాట్లాడడానికి ఓ స్థాయి ఉండాలని అంటున్న హరీష్ రావు… ఏ స్థాయి ఉండాలి అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి పాత్ర ఏందో ప్రజలకు తెలుసునని, బీజేపీ విధానము చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీ, తెలంగాణను కలుపుతారని కేటీఆర్ అంటున్నారని, మేము పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత దేశంలో కలుపుతామని ఆయన అన్నారు. హైదరాబాద్ ని, జమ్మూ కాశ్మీర్ ను బలవంతంగా కలిపారని కవిత అన్నారని, తెలంగాణ వేరే దేశంగా ఉండాలని అనుకుంటున్నారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. హిజాబ్ వివాదానికి బీజేపీకి సంబంధం లేదు… నిషేధిత సంస్థకు చెందిన కొందరు చేసిన కుట్ర.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు కుట్ర చేస్తున్నారు.. తెలంగాణ రెండు జాతీయ పార్టీలు సహకరిస్తే, 12 వందల అమరుల త్యాగాలతో పుట్టింది… కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణ తమకే పుట్టిందని చెప్పుకుంటున్నారు అని ఆయన ధ్వజమెత్తారు. మీ నియోజక వర్గాలకు ఎన్ని నిధులు తీసుకెళ్లారో… మిగతా నియోజక వర్గాల్లో ఎన్ని గుండు సున్నాలు పెట్టారో చర్చకు సిద్ధమా హరీష్ రావు అని ఆయన సవాల్ విసిరారు.
- Tags
తాజావార్తలు
-
CheQ AU Credit Card: పేమెంట్ చేయగానే గ్రీన్ లైట్.. భారత్ లో మొదటి LED కో-బ్రాండెడ్ కార్డు
-
RCB vs DC: కోహ్లీ మెరుపులు కాసేపే.. భారీ స్కోరు మిస్సైన బెంగళూరు! ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
-
Mangalavaaram: కొరటాల శివ నిర్మాణంలో ‘మంగళవారం 2’?
-
Iran Fire: హర్మూజ్ దాటే నౌకలపై ఇరాన్ కాల్పులు.. భారత్ వచ్చే రెండు నౌకలు దారి మళ్లింపు..
-
SRH vs CSK: ధోనీ శిష్యులపై కాటేరమ్మ కొడుకుల పంజా.. ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ హవా సాగేనా?
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!