Site icon NTV Telugu

Jogu Ramanna: కుర్చీ మీద ఉన్న ధ్యాస ప్రజలపైన ఉందా?

Jogu Ramanna

Jogu Ramanna

కేసీఆర్ సమర్థుడు కాబట్టే బీజేపి జాతీయ నేతలు గ్రామ గ్రామాన తిరుగుతున్నారు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. దేశంలోని బీజేపీ నేతలందరికీ కేసీఆర్ సమానం అని మీరే రుజువు చేస్తున్నారన్నారు. కుర్చీ మీద ఉన్న ధ్యాస ప్రజలపైన ఉందా అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంకు మీరు ఏం చేసారని రాష్ట్రంకు వస్తున్నారని, బయ్యారం ఉక్కు కర్మాగారం ఎక్కడ.. ఆదిలాబాద్ సీసీఐ ఏది అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కి మీరు భయపడుతున్నరు. అందుకే రాష్ట్రంకు ఇన్ని సార్లు వస్తున్నారంటూ జోగు రామన్న విమర్శించారు.

బీజేపీ నాయకులు అసమర్థులు, దద్దమ్మలు కాబట్టే ఎం తీసుకు రావడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ తెలంగాణ ఇచ్చుడే తప్పు అన్న వ్యక్తి అని.. మీరు ఏం చెప్పుతారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఆ పార్టీ నేతలు పగటి కలలే.. అవి నిజం కావు ఆయన వెల్లడించారు.

 

Exit mobile version