Site icon NTV Telugu

Jagga Reddy : రేపు సంచలన నిర్ణయం తీసుకుంటా

Mla Jagga Reddy

Mla Jagga Reddy

టీపీసీసీ అధ్యక్షుడి రేవంత్‌ రెడ్డి నియామకమైన నాటి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డికి రేవంత్‌ రెడ్డికి మధ్య సత్సంబంధాలు బలపడడం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు మీడియా ముందు రేవంత్‌పై విమర్శలు చేసిన జగ్గారెడ్డిని.. ఓ సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు కూడా. అయితే కాంగ్రెస్‌ పెద్దలు జగ్గారెడ్డిని బుజ్జగించి కాంగ్రెస్‌ను వీడిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గమన్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా.. విపక్షాల తరుఫున రాష్ట్రపతి పోటీలో ఉన్న యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌కు విచ్చిస్తున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి ఆయనను కలిసేందుకు ఎవ్వరూ వెళ్లవద్దంటూ హుకుం జారీ చేశారు. ఆయన ఆదేశాలు పట్టించుకోకపోతే పార్టీపరంగా చర్యలు కూడా తీసుకుంటానని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను మరోసారి తప్పపడుతూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. అంతేకాకుండా తాజాగా ఆయన మాట్లాడుతూ..రేపు సంచలన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పిన అనే అవేదన లో ఉన్నానన్న జగ్గారెడ్డి.. పార్టీ అంతర్గత అంశాలు మీడియాలో మాట్లాడను అని మాటిచ్చానన్నారు. కానీ రేవంత్ వ్యవహారం వల్లనే మాట తప్పానని, పార్టీ చీఫ్‌కి రాజకీయ వ్యూహం ఉండాలని, తెలంగాణలో పార్టీకి నష్టం జరిగితే నాపై నిందలు మోపే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుని తెలంగాణ కనుమరుగు చేసింది ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డి అతి ఉత్సాహం దీనికి కారణమన్నారు. పార్టీ నడిపే నాయకుడికి వ్యూహం ఉండాలన్నా జగ్గారెడ్డి.. కానీ రేవంత్ కి అది లేదన్నారు.

 

Exit mobile version