తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్-బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా..చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కంటే ఒక్క ఓటు ఎక్కువ అయినా మేము సంపాదిస్తామన్నారు. టీఆర్ఎస్ బీజేపీ లు అధికారంలో ఉండి అంగ బలాన్ని, అర్థ బలాన్ని ఓటర్ల పై ప్రయోగించడానికి చూస్తున్నారన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి క్యాడర్ లేదన్నారు. మునుగోడులో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంటుందన్నారు.
Read Also: T20 World Cup: పాండ్యాకు విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం లేదు.. స్పష్టం చేసిన టీమిండియా కోచ్
ఎక్కడ ఉప ఎన్నికలు జరిగిన అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తుందన్నారు. కొయ్యలగూడెం గ్రామంలో దాదాపు 2200 ఓట్లు ఉన్నాయి, కాగా ఎన్నికల్లో కేవలం 2000 ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా గట్టిగా స్రవంతి గెలుపు కోసం పనిచేస్తుందన్నారు. కేవలం నాయకులు ప్రలోభాలు పెట్టడం వల్లనే ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు.
అది ప్రజలందరికీ తెలుసని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురే ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనుంది. ప్రజలు కచ్చితంగా ఆమెని ఆశీర్వదిస్తారు. చౌటుప్పల్ మండలానికి మాజీ పీసీసీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్చార్జిగా ఉన్నారు. నాకు కోయలగూడెం ఇన్చార్జిగా ఇవ్వడం వల్ల ఈరోజు ప్రచారానికి రావడం జరిగిందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నాకు ఇన్చార్జ్ ఇచ్చిన కోయలగూడెంలో నేను పది రోజులు ఉండి ప్రచారం నిర్వహిస్తాను. మునుగోడు ప్రజలు పాల్వాయి స్రవంతిని ఆశీర్వదించి గెలిపిస్తారని విశ్వసిస్తున్నా అన్నారు.
Read Also: Mastan Vali: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా