తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల సమావేశం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వమే కావాలంటూ సమావేశమైనట్లు ఇటీవల స్పష్టత ఇచ్చారు. అయితే నేడు మరోసారి టీకాంగ్రెస్ సీనియర్లు సమావేశం కానున్న నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి ఫోన్ చేసి సమావేశం నిర్వహించవద్దన్నారు. అంతేకాకుండా ఏమైనా సమస్య ఉంటే.. నేరుగా సోనియా, రాహుల్ ల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి మేలు చేయాలనే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, నేను పార్టీ మారుతున్న అని అధిష్టానం కి టాగూర్..రేవంత్ చెప్పారన్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా మా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితి ఉంటే పార్టీ నడుస్తుందా .? అని ఆయన ప్రశ్నించారు. సోనియా, రాహుల్ గాంధీల కు అన్ని విషయాలు చెప్తామని, పంజాబ్ లో పీసీసీ చీఫ్ సిద్దు తోనే పార్టీ ఖతం అయ్యిందని ఆయన మండిపడ్డారు. సీనియర్స్ సమావేశంకి వెళ్లొద్దు అని నాకెవరూ చెప్పలేదని, రాష్ట్ర నాయకత్వం మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
