Jaggareddy: తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణను రూపొందించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో.. నేరుగా సమావేశం పెట్టకుండా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. జూమ్ మీటింగ్ ఉందని అంటే కోపం వచ్చిందని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ కూడా ప్రజల సమస్యలపై కొట్లాడాలని అన్నారు. మా పార్టీ లో కూడా ఇబ్బంది ఉందని సంచళన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మామహేష్ గౌడ్ ఫోన్ చేశారని అన్నారు. జూమ్ మీటింగ్ ఉంది అంటే కోపం వచ్చిందని అన్నారు. జూమ్ మీటింగ్ ఏంది? మహేష్ గౌడ్ కూడా సరిగా సమన్వయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని సరిగా చేయడం లేదని మండిపడ్డారు. పీసీసీ.. సీఎస్‌పి సమవ్యయం చేయాలని అన్నారు.
Read also: Hero Nani : నీకు ‘మీట్ క్యూట్’ అంటే తెలుసా? అంటున్న హీరో నాని
పీసీసీ మీటింగే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోన సమయంలో జూమ్ పెట్టారు అంతే ఇప్పటి వరకు సమావేశం పెట్టకపోవడం సరికాదన్నారు. దీనివల్ల నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్ననని అన్నారు. రేవంత్ పీసీసీ కాకముందు అధిష్టానంకి లేఖ రాశా అన్నారు. నా దగ్గర మెడిసిన్ ఉంది అన్నా ఎవరు స్పందించలేదన్నారు. ఇప్పటికి కూడా నా దగ్గర మెడిసిన్ ఉంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా అన్నారు. పీసీసీ భవిష్యత్తులో అవకాశం వస్తే… అన్ని చేస్తా అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. పీసీసీ ని ఎన్నికల సమయంలో మార్చండని అననుఅంటూ సంచళన వ్యా్‌క్యలు చేశారు. ఎన్నికల తరవతే… పీసీసీ మార్పు చర్చ చేస్తామన్నారు. ఇప్పుడు మాట్లాడితే సరికాదన్నారు. నా మెడిసిన్ నేనే వాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మార్పు నష్టమే అని, అలాంటి వాళ్ళు పార్టీ వదిలేస్తే నష్టమన్నారు. దానికి పూర్తి బాధ్యత రేవంత్, సీఎల్‌పి నేత భట్టి వహించాలన్నారు.
