NTV Telugu Site icon

Jagga Reddy: కేసీఆర్‌, హరీష్‌రావుకి కృతజ్ఞతలు తెలిపిన జగ్గారెడ్డి..

Jagga Reddy

Jagga Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. అదేంటి? ప్రతీరోజు అధికార పార్టీని, కొన్నిసార్లు సీఎం కేసీఆర్‌ను, చాలాసార్లు మంత్రి హరీష్‌రావును టార్గెట్‌ చేసే జగ్గారెడ్డి ఉన్నట్టుండి ఇలా కృతజ్ఞతలు తెలిపడం ఏంటి? అనే సందేహం కలగొచ్చు.. విషయం ఏంటంటే.. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ విషయంలో.. సంగారెడ్డి ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి సంబంధించిన సమాచారం తనకు ఉందన్న ఆయన.. హెల్త్ మినిస్టర్ హరీష్ రావు ప్రారంభిస్తున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యేగా నాకు చెప్పారని వెల్లడించారు.

Read Also: Amazon: ఇక అమెజాన్‌ వంతు.. 10 వేల మంది ఉద్యోగులకు ఊస్టింగ్..!

2013 కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మెడికల్‌ కాలేజీపై ప్రత్తిపాదనలు పంపించడం జరిగిందని.. ఆ తర్వాత మెడికల్ కాలేజీ మంజూరు అయ్యింది.. కానీ, దానిని సిద్ధిపేటకి తరలించరాని తెలిపారు జగ్గారెడ్డి.. తర్వాత మెడికల్ కాలేజీ కోసం నేను మూడేళ్లు పోరాటం చేసిన విషయం మీ అందరికి తెలిసిందేనని.. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగిందని.. ఏదైమైనా నా మూడేళ్ల ఉద్యమం, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ఫలించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక, నేను అసెంబ్లీలో మూడుసార్లు మెడికల్ కాలేజీ గురించి అడగడం జరిగిందన్నారు జగ్గారెడ్డి… సీఎం కేసీఆర్‌ దానిపై సానుకూలంగా స్పందించారన్న ఆయన.. చెప్పిన్నట్లే కేసీఆర్ డబ్బులు రిలీజ్‌ చేసి మెడికల్ కాలేజీ బిల్డింగ్ పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు.. అందుకే సంగారెడ్డి ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కేసీఆర్‌, హరీష్‌రావుకి కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.. ఇక రానున్న రోజులో సంగారెడ్డి ప్రజలు ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది కనుక చాలా ఆనందంగా ఉంది.. ప్రతిపక్షంలో ఉన్నపుడు పనులు కాకపోతే అడుగుతాం…. అయితే, పనులు అయ్యాయని చెప్తాం అన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.