Jagga Reddy: కేసీఆర్, హరీష్‌రావుకి కృతజ్ఞతలు తెలిపిన జగ్గారెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. అదేంటి? ప్రతీరోజు అధికార పార్టీని, కొన్నిసార్లు సీఎం కేసీఆర్‌ను, చాలాసార్లు మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేసే జగ్గారెడ్డి ఉన్నట్టుండి ఇలా కృతజ్ఞతలు తెలిపడం ఏంటి? అనే సందేహం కలగొచ్చు.. విషయం ఏంటంటే.. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ విషయంలో.. సంగారెడ్డి ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి సంబంధించిన సమాచారం తనకు ఉందన్న ఆయన.. హెల్త్ మినిస్టర్ హరీష్ రావు ప్రారంభిస్తున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యేగా నాకు చెప్పారని వెల్లడించారు.
Read Also: Amazon: ఇక అమెజాన్ వంతు.. 10 వేల మంది ఉద్యోగులకు ఊస్టింగ్..!
Also Read
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
2013 కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మెడికల్ కాలేజీపై ప్రత్తిపాదనలు పంపించడం జరిగిందని.. ఆ తర్వాత మెడికల్ కాలేజీ మంజూరు అయ్యింది.. కానీ, దానిని సిద్ధిపేటకి తరలించరాని తెలిపారు జగ్గారెడ్డి.. తర్వాత మెడికల్ కాలేజీ కోసం నేను మూడేళ్లు పోరాటం చేసిన విషయం మీ అందరికి తెలిసిందేనని.. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగిందని.. ఏదైమైనా నా మూడేళ్ల ఉద్యమం, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ఫలించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక, నేను అసెంబ్లీలో మూడుసార్లు మెడికల్ కాలేజీ గురించి అడగడం జరిగిందన్నారు జగ్గారెడ్డి… సీఎం కేసీఆర్ దానిపై సానుకూలంగా స్పందించారన్న ఆయన.. చెప్పిన్నట్లే కేసీఆర్ డబ్బులు రిలీజ్ చేసి మెడికల్ కాలేజీ బిల్డింగ్ పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు.. అందుకే సంగారెడ్డి ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కేసీఆర్, హరీష్‌రావుకి కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.. ఇక రానున్న రోజులో సంగారెడ్డి ప్రజలు ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది కనుక చాలా ఆనందంగా ఉంది.. ప్రతిపక్షంలో ఉన్నపుడు పనులు కాకపోతే అడుగుతాం…. అయితే, పనులు అయ్యాయని చెప్తాం అన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!