Site icon NTV Telugu

MLA Jagga Reddy : కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో తెలియదు నాకు

రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు ఎక్కడైనా తిరగవచ్చునని, పార్టీ నాయకులకు రాహుల్ గాంధీ ముఖ్యమన్నారు ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. అయితే కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో తెలియదు నాకు తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్‌ఎస్‌, బీజేపీ గురించే మాట్లాడుతానని.. కానీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో తెలియదన్నారు.

ఈ మధ్య టీవీలు చూడటం మానేశానన్న జగ్గారెడ్డి.. అందుకే ఏం జరుగుతుందో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఈ రోజు నల్గొండ జిల్లాలో టీపీసీసీ రేవంత్‌ రెడ్డి పర్యటించారు. అక్కడి కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి పర్యటకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో మరోసారి కాంగ్రెస్‌ విభేదాలు రచ్చకెక్కాయి. అంతేకాకుండా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది.

Exit mobile version