Harish Rao: నాడు ఓటుకు నోటులో దొరికిన రేవంత్ రెడ్డి నేడు ఓటుకు ఒట్టు అంటున్నాడు అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్ధిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను హరీష్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ కోసం ఆనాడు బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాజీనామా చేయలేదన్నారు.
Read also: Gidugu Rudraraju: చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో..? ఆయనే క్లారిటీ ఇవ్వాలి
తెలంగాణ ప్రజల కోసం మేము రాజీనామా చేశాము.. మిలాగా ఫేక్ రాజీనామాలు చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇస్తా అన్నారు. నాడు ఓటుకు నోటులో దొరికిన రేవంత్ నేడు ఓటుకు ఒట్టు అంటున్నాడని తెలిపారు. మీ దగ్గర సరుకు లేదు..మీరు నన్ను తిడుతున్నారు తప్ప మీ దగ్గర సమాధానం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు జిల్లాలు ఎక్కువ అయ్యాయని తక్కువ చేయాలని చూస్తున్నారని తెలిపారు.
Read also: Ponguleti Srinivasa Reddy: ధరణి అనే దయ్యాన్ని సరిదిద్ధు తున్నాం..
స్పీకర్ ఫార్మాట్ లో ఇద్దరం రాజీనామా లేఖని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ఇద్దామని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కొత్త సవాల్ విసిరారు. రాజీనామా లేఖ ఎలా ఇవ్వాలో మాకు తెలుసన్నారు. మీరు బాండ్ పేపర్ పై రాసిచ్చిన గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేయండి నేను రాజీనామా చేస్తా అన్నారు. మాకు రాజినామాలు కొత్త కాదు…తెలంగాణ కోసం రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. రేవంత్ రెడ్డి జిరాక్స్ లో పేపర్ లో రాజీనామా ఇస్తే… తప్పించుకొని తిరిగిన వ్యక్తి కిషన్ రెడ్డి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
B Vinod Kumar: కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్, వినోద్ కుమార్ మధ్యనే పోటీ..