తెలంగాణ సీఎం కేసీఆర్ మీద మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఘట్కేసర్ మండలం అన్నాజిగూడాలోనీ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో జరుగుతున్న ఎస్టీమోర్చా శిక్షణా తరగతులకు హాజరై కేసీఆర్ వైఫల్యాల మీద ప్రసంగించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తెలంగాణవస్తే అందరి కంటే ఎక్కువ బాగుపడతాం అని తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న వారు మన గిరిజన బిడ్డలు. అలాంటివారిని తెలంగాణ రాగానే 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్త అని చెప్పి మోసం చేసిన వ్యక్తి కెసిఆర్. ఎనిమిదిన్నర సంవత్సరాలు నెపం కేంద్రం మీద నెట్టి ఎంతోమంది విద్యార్థులను చదువుకి దూరం చేసిన దుర్మార్గుడు. కానీ మునుగోడులో 33 తండాల్లో ఉన్న 13 వేల ఓట్ల కోసం ఆఘమేఘాల మీద గిరిజన రిజర్వేషన్లు ప్రకటించారు. ఎన్నికలప్పుడు మాత్రమే పని చేస్తా అని మరోసారి నిరూపించుకున్నారన్నారు.
Read ALso: Tension at Raj Bhavan: రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత.. పలువురు అరెస్ట్
పోడుభూముల పట్టాలు ఇస్తా అని మోసం చేసిన సీఎం.. కెసిఆర్. గుర్రంపోడు దానికి సజీవ సాక్ష్యం. అసెంబ్లీ వేదికగా ఎన్నో సార్లు కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తా అని చెప్పి మాటతప్పిన వాడు కెసిఆర్. ఫారెస్ట్ ఆఫీసర్ హత్యకు కారకుడు కెసిఆర్. హైదరాబాద్ చుట్టుపక్కల గుడిసెలు వేసుకుని బ్రతుకుతున్న గిరిజనుల గుడిసెలు పీకేసి ఆ భూములు పెద్దవాళ్ళకు కట్టబెడుతున్నారు. పెద్దవాళ్ళు ఇచ్చే ఎంగిలిమెతుకుల కోసం గిరిజనులను ఇబ్బందిపెడుతున్నారు. భూప్రక్షాళనపేరిట దళిత, గిరిజనుల భూములు కొల్లగొడుతున్నారు. ఊళ్ళనుండి పారిపోయిన వారు మళ్లీ ఆభూములకు ఓనర్లు అయ్యారు.
పది శాతం ఉన్న గిరిజనులకు ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. వారి కుటుంబసభ్యులకు మాత్రం 0.6 శాతం ఉన్నవారికి 4 మంత్రి పదవులు ఇచ్చుకున్నారు. అదే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 27 మంత్రి పదవులు obc లకు కట్టబెట్టారు. 12 మంది దళితులు, 8 మంది గిరిజనులు, 5 మంది మైనారిటీలు మంత్రులుగా ఉన్నారు. మన దేశ రాష్టపతి ఆదివాసి మహిళ.. ఇది సోషల్ జస్టిస్ అంటే. 9 ఏళ్లుగా సీఎం ఆఫీసులో ఒక్కరన్న దళిత, గిరిజనబిడ్డ ఉన్నారా ? ENC ఒక్కరన్నా గిరిజన బిడ్డ ఉన్నారా ? అని ఈటల ప్రశ్నించారు.
దళిత గిరిజనులు బీసీలు ముఖ్యమైన పదవుల్లో ఉన్నారా ? ఇన్ని తెలిసిన తరువాత కూడా మనం మౌనంగా ఉంటే చరిత్ర క్షమించదు. స్పీకర్ ను మరమనిషి అని అన్నందుకు నన్ను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసి.. పోలీసు వాహనాల్లో కుక్కి అరెస్ట్ చేయించారు కెసిఆర్. కళ్ళముందే ధర్నాచౌక్ ఎత్తివేసిన, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన, చట్టాలను చట్టబండలు చేసిన కెసిఆర్ మీకు ఏవిధంగా ప్రగతి కామకులుగా కనిపిస్తున్నారు. మేధావులారా భారత్ బచావో కాదు ముందు తెలంగాణ బచావో చేద్దాంరండి. ఎన్నికలప్పుడు మాత్రమే కెసిఆర్ కి ప్రజలు గుర్తుకు వస్తారు. ఇంకా గొర్రెల లెక్క ఓట్లు వేయవద్దు. కెసిఆర్ పాలనకు చరమగీతం పాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఈ దుర్మార్గపు, దుర్నీతి పాలన అంతం చేయడంలో మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈ కర్తవ్యంలో గిరిజన మోర్చ కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు ఈటల రాజేందర్.
Read Also: BC Sadassu: 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం..
