NTV Telugu Site icon

Etala Rajender: బడ్జెట్ పై విమర్శలు చేయట్లే కానీ..

Etalarajender Harish Rao

Etalarajender Harish Rao

Etala Rajender: హరీష్ రావు మీ గొప్ప దార్శనికతను అమల్లో చూపించండి అంటూ చురకలంటించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా ఆయన మాట్లాడుతూ..బడ్జెట్ అంత అంకెల గారడే అంటూ విమర్శించారు. 70-80 శాతం నిధులు విదులుకావాలన్నారు. చాలా డిపార్టుమెంట్లకు కోతే పెట్టారని ఆరోపించారు. రుణమాఫీ చెయ్యాలని రైతుకు కోరుతున్నారని, బ్యాంకులకు పోతే ఋణం ఇవ్వమని చెబుతున్నారుని, ఈ విషయం బీజేపీ దృష్టికి వచ్చిందన్నారు ఈటెల. పూర్తి రుణమాఫీ చేయాలనీ కోరుతున్నామన్నారు. ఉద్యోగులకు హౌసింగ్ రుణాలు ఇవ్వడం లేదని, టైంకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్ఫ్, వివోలకు జీతాలు పెంచలెదన్నారు.

Read also: V. Hanumantha Rao: రేవంత్ ఫోన్ చేసి పాదయాత్రకి రమ్మన్నారు

మధ్యాహ్నం భోజనం వండే వర్కర్లకు దారుణం నెలకు వెయ్యి రూపాయలా? అంటూ ప్రశ్నించారు. అవి కూడా సకాలంలో ఇవ్వడంలేదని మండిపడ్డారు. కేసీఆర్ కిట్టు కూడా సకాలంలో ఇస్తలేరని, బాసరలో చదివే ఐఐటీ విద్యార్థులు 3నెలలు ధర్నా చేశారని గుర్తు చేశారు. ఫుడ్, స్టాఫ్, మౌళిక సదుపాయాలు సరిగ్గాలేవని తెలిపారు. ఆరోగ్య శ్రీ, ehs నిధులు కూడా విడుదల చేయకపోవడంతో ట్రీట్ మెంట్ జరగడం లేదని ఈటెల పేర్కొన్నారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు కూడా పైసలు ఇస్తలేదని, పైరవీ చేసుకునే వాళ్ళకే కాంట్రాక్టర్లకు బిల్లులిస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్ పై విమర్శలు చేయడం లేదు, ఆర్బాటం తప్ప మరేం లేదని ఎద్దేవ చేశారు. బెల్ట్ షాపులతోనే ప్రజలను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి ఏడాదికి వస్తుందని, హరీష్ రావు మీ గొప్ప దార్శనికతను అమల్లో చూపించండని ఈటెల రాజేందర్‌ కోరారు.
Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి.. ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు