NTV Telugu Site icon

Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి.. ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు

Huzurabad Mla Etala Rajender

Huzurabad Mla Etala Rajender

Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయని.. ఈఅరాచకం ఎక్కువ రోజులు చెల్లదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను బీఆర్‌ఎస్ నేతలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ గెలుపును అడ్డుకోలేకపోయారని, అయితే ఒకానొక సమయంలో అధికార పార్టీ బలం మొత్తం ఫలించలేదని ఈటెల గతంలో చాలాసార్లు ఆరోపించారు.

Read also: Telangana Budget: అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన హరీష్‌ రావు.. ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే…

హుజూరాబాద్‌లో శాంతియుత వాతావరణాన్ని అధికార పార్టీ నేతలు చెడగొట్టారని ఈటల ఆరోపించారు. ప్రజలపై దాడులు చేస్తున్నారని, బీజేపీ కార్యకర్తలు తమను విచక్షణారహితంగా కొట్టారని విమర్శించారు. నిన్న తమపై దాడి జరిగితే దాడిచేసిన వారిని వదిలిపెట్టారని.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు బీజేపీ నాయకులు, కార్యకర్తలను తీసుకెళ్లి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచకాలు ఎక్కువ కాలం సాగవని అధికార పార్టీ చేస్తున్న ఆగడాలు శృతిమించాయన్నారు ఈటల అన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారా? టాస్క్‌ఫోర్స్ పోలీసులు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? కొట్టడం ఏమిటి? చట్టం పని చేస్తుందా అని డీజీపీని ప్రశ్నించారు. తన మండలానికి చెందిన మాట్ల రమేష్, మాట్ల కళ్యాణ్, పంగిడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, పిల్లి సతీష్, తుమ్మ శోభన్‌లను వెంటనే విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు.

మళ్లీ రాజకీయ వేడి…

హుజూరాబాద్ కేంద్రంగా రాజకీయంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఈటల రాజేందర్‌ను ఐటీ పురపాలక శాఖ మంత్రి ఈ నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత ఆయనకు ఆహ్వానం అందలేదు. మరోవైపు వారిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ తన ప్రసంగాల్లో ఘాటుగా ప్రశ్నించారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో అయినా ఈ నియోజకవర్గంలో గెలుపు సొంతం చేసుకోవాలని ఇప్పటి నుంచి దూకుడు పెంచారు స్థానిక నాయకులు. ఈనేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Suspension on CI: చేర్యాల CI పై సస్పెన్షన్ వేటు.. బాధ్యతలు చేపట్టి 9 నెలల్లోనే..