NTV Telugu Site icon

Telangana Elections: ఓటు వెయ్యడానికి ₹ 2.5 లక్షలు.. తీరా చూస్తే లిస్ట్ లో పేరు లేదు..

Untitled 1

Untitled 1

Telangana: ఓటు హక్కు ఉండి. ఓటు వేసే అవకాశం ఉన్న మనలో కొంత మంది పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వెళ్ళాయాలంటే అబ్బా ఏం పోదాంలే అనుకుంటారు. ఇక పక్క రాష్ట్రాల్లో పని చేసే ఓటర్లలో కొందరు అయితే ఓటు కోసం చార్జీ పెట్టుకొని ఊరికి వెళ్లాలా అనుకుని ఓటు హక్కును వినియోగించుకోని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఓ వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి మరి పోలింగ్ కేంద్రానికి వెళ్లగా.. అసలు ఓటరు జాబితాలో పేరే లేదన్నారు అధికారులు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం లోని మంచిర్యాల జిల్లా లోని జన్నారం మండలం లోని చింతగూడ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ గత 15 సంవత్సరాలుగా న్యూజిలాండ్‌ లోని ఓ కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కాగా జరగున్న అసంబ్లీ ఎన్నికలకు సొంత ఊరు కి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోవాలి అనుకున్నారు.

Read also:Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

ఈ నేపథ్యంలో తన స్నేహితుడి ద్వారా ఓటరు జాబితాను వాట్సాప్‌లో పొందాడు. ఆ జాబితాలో శ్రీనివాస్, అతని భార్య లావణ్య పేర్లు ఉన్నాయి. దీనితో స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులతో గడిపి ఓటు వేయాలని ప్లాన్ చేసుకున్నాడు.. ఈ నేపథ్యంలో రూ/2.5 లక్షలు ఖర్చుసి మరి ఓటు వేయడానికి సొంత ఊరికి వచ్చాడు. కాగా నవంబర్ 30 వ తేదీన తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ తన భార్య తో కలిసి ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అక్కడి అధికారులు జాబితాలో తన భార్య పేరు మాత్రమే ఉందని శ్రీనివాస్ పేరు లేదని చెప్పారు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న జాబితాని చూపించగా.. శ్రీనివాస్ దగ్గర ఉన్న జాబితా పాతదని.. సవరించిన జాబితాలో శ్రీనివాస్ పేరు లేదని తేల్చి చెప్పేసారు. దీనితో చేసేదేమి లేక ఓటు వెయ్యకుండానే వెనుదిరిగారు.