Site icon NTV Telugu

Gachibowli Pub: వెలుగులోకి మ‌రోప‌బ్ ఆగ‌డాలు.. బ‌డానేత ప్ర‌మేయం

Gachibowli Pub

Gachibowli Pub

న‌గ‌రంలో వ‌రుస ప‌బ్ ఘ‌ట‌న‌లు వెలుగులోకి వస్తున్నా, విమర్శలు వెల్లువెత్తుతున్నా, న‌గరంలో పబ్‌ల తీరు మారడం లేదు. అయితే తాజాగా జూహ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ తరహాలో ఓ పబ్‌లో మైనర్ల పార్టీ నిర్వహించడంతో ఈ భాగోతం వెలుగులోకి వ‌చ్చింది. న‌గరంలోని గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో రెండ్రోజుల పాటు కొంద‌రు మైనర్ల పార్టీ నిర్వహించినట్లు స‌మాచారం. అయితే ఈ ఈవెంట్‌కు సైబర్‌ హవర్స్‌ వాల్యూమ్‌-11 పేరుతో నిర్వహించ‌డం సంచ‌లనంగా మారింది. అయితే.. అమ్మీషియా ప‌బ్ వ్య‌వ‌హారంతో నగ‌రంలో మైనర్ల పార్టీకి ఎక్సైజ్‌ శాఖ అనుమతి నిరాకరించిన విష‌యం తెలిసిందే.

కాగా దీనిని ఓ బడా నేత ప్రమేయంతో మైనర్ల పార్టీ ఓరేంజ్‌ చేసినట్లు విశ్వ‌నీయ స‌మాచారం. అయితే ఈ పార్టీకోసం ఇన్‌స్టాగ్రామ్ ను వాడుకున్న‌ట్లు తెలుస్తోంది. దీని ద్వారా మైనర్ల పార్టీకి ఆహ్వానాలు పంపించార‌ని తెలుస్తోంది. అయితే ఈ వ్య‌వ‌హారం పై నిర్వాహకులు ప్ర‌శ్నిస్తే.. పబ్‌లో మద్యం సరఫరా చేయలేదంటూ చేతులు దులుపుకుంటున్నారు.అయితే జూబ్లీహిల్స్ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మల్లి మైనర్లు పార్టీ కోసం ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వడంతో ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావులేపుతోంది.

Alia Bhatt: తల్లి కాబోతున్న ఆలియా.. స్వయంగా ప్రకటించిన బాలీవుడ్ స్టార్

Exit mobile version